క్రీడాభూమి

గులాబీ బంతి తీరు ఆసక్తి రేపుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, నవంబర్ 13: డే, నైట్ టెస్టు మ్యాచ్‌లో ఉపయోగించే గులాబీ రంగు బంతుల తీరు ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తిని రేపుతోందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. బంగ్లాదేశ్‌తో గురువారం ప్రారంభం కానున్న మొదటి టెస్టు మ్యాచ్ సందర్భంగా బుధవారం విలేఖరులతో మాట్లాడిన కోహ్లీ గులాబీ బంతితో టెస్టు మ్యాచ్ ఆడడానే్న ఎక్కువగా ప్రస్తావించాడు. బంగ్లాతో మొదటి టెస్టు డే మ్యాచ్‌గానే జరుగుతుంది. ఈనెల 22 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమయ్యే రెండవ, చివరి టెస్టు మ్యాచ్‌లో డే, నైట్ ఈవెంట్‌గా నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇప్పటికే డే, నైట్ టెస్టు మ్యాచ్‌లు ఆడినప్పటికీ భారత్ మాత్రం తొలిసారి ఇలాంటి మ్యాచ్ ఆడనుంది. అందుకే మొదటి మ్యాచ్ కోసం కూడా నెట్స్‌లో గులాబీ రంగు బంతులను భారత్ వినియోగించింది. ఇటు సూర్యుడి వెలుతురులో, అటు ఫ్లడ్ లైట్ వెలుగులో స్పష్టంగా కనిపించేందుకు బంతులకు గులాబీ రంగును అదనంగా అద్దుతారు. దీంతో బంతి ఏవిధంగా స్పిన్ అవుతుంది అనేది అర్థం కావడం లేదని కోహ్లీ అన్నాడు. అయితే, పరిమిత ఓవర్ల మ్యాచ్‌లను ఫ్లడ్ లైట్ వెలుగులో, గులాబీ బంతులతో ఆడిన అనుభవం ఉంది కాబట్టి బంతి వేగాన్ని, దిశను, స్పిన్‌ను అంచనా వేయడం సాధ్యమవుతుందని చెప్పాడు. టెస్టు మ్యాచ్‌లను ఎర్ర బంతితో అలవాటు ఉందని, హఠాత్తుగా ఇపుడు గులాబీ బంతులతో ఆడాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితులను సృష్టించవచ్చునని కోహ్లీ స్పష్టం చేశాడు. అయితే, త్వరగానే గులాబీ బంతులకు అలవాటు పడతామనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయడం లేదని ఆయన స్పష్టం చేశాడు. ప్రతీ మ్యాచ్ తమకు కీలకమైనదని, విజయం కోసం సర్వ శక్తులూ కేంద్రీకరించి పోరాడుతామని అన్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను కైవసం చేసుకోవడాన్ని విలేఖరులు ప్రస్తావించగా, అది గతమని, ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్‌తో ఆడుతున్నామన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
సెంచరీల పరంగా చూస్తే బంగ్లాదేశ్ కంటే భారత్ ఎంత పటిష్టవంతమైన స్థితిలో ఉందో అర్థమవుతుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినుల్ హక్ ఒక్కడే ఆ జట్టులో అత్యధికంగా 8 టెస్టు సెంచరీలు సాధించాడు. కాగా, భారత్ జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ 26 టెస్టు సెంచరీలు చేశాడు. చటేశ్వర్ పుజారా 18, అజింక్య రహానే 11 చొప్పున టెస్టు సెంచరీలు తమ ఖాతాల్లో వేసుకున్నారు. బంగ్లా జట్టులో మొమినుల్ హక్‌తోపాటు ముస్త్ఫాజుర్ రహ్మాన్, మహముదుల్లా రియాజ్ కూడా సమర్థులైన ఆటగాళ్లే. భారత్ జట్టులో వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లతోపాటు మయాంక్ అగర్వాల్, కుల్దీప్ యాదవ్ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. శుభమ్ గిల్, హనుమ విహారీ, రిషబ్ పంత్ రిజర్వు ఆటగాళ్లుగా ఉన్నారంటే భారత్ జట్టు బలాన్ని ఊహించుకోవచ్చు.
*చిత్రం... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ