క్రీడాభూమి

నెట్స్‌లో టీమిండియా బిజీబిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్: బంగ్లాదేశ్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం మంగళవారం భారత జట్టు నెట్స్‌లో బిజీబిజీగా గడిపింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇతర కీలక ఆటగాళ్లు రెగ్యులర్ వామప్‌తోపాటు నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈనెల 22 నుంచి కోల్‌కతాలో ప్రారంభమయ్యే రెండో టెస్టును డే నైట్ ఈవెంట్‌గా నిర్వహిస్తున్న నేపథ్యంలో, భారత శిబిరంలో ఉత్కంఠ నెలకొంది. టెస్టు హోదా ఉన్న చాలా జట్లు ఇప్పటికే డే నైట్ టెస్టులు ఆడుతుండగా, భారత్‌కు మాత్రం ఇదే మొదటిసారి. గులాబీ రంగు బంతులతో ఆడే ఆ టెస్టు కోసం కోహ్లీ బృందం అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. మొదటి టెస్టు డే ఈవెంట్ అయినప్పటికీ, టీమిండియా దృష్టి మాత్రం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే రెండో టెస్టుపైనే కేంద్రీకృతమైందనేది నిజం.
ఆకట్టుకున్న కోహ్లీ
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మంగళవారం బిచోలీ మర్దానా ప్రాంతంలో గల్లీ క్రికెట్ ఆడి, అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్‌ను మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో 2-1 తేడాతో ఓడించిన భారత్ ఇప్పుడు అదే జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. మొదటిది డే మ్యాచ్‌కాగా, రెండో టెస్టు డే నైట్ ఈవెంట్. అందుకే, ఒక రకమైన ఉత్కంఠ భారత శిబిరంలో నెలకొంది. కాగా, మొదటి టెస్టు కోసం సిద్ధమవుతున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ కొంత సేపు గల్లీ క్రికెట్ ఆడి, అందరినీ అలరించాడు.