క్రీడాభూమి

కిప్టుమ్‌హాస్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, నవంబర్ 12: కెన్యా మారథాన్ వీరుడు, హాఫ్ మారథాన్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పిన అబ్రహం కిప్టుమ్‌హాస్‌పై వేటు పడింది. డోప్ పరీక్షలో విఫలమైన కారణంగా అతనిని నాలుగు సంవత్సరాల పాటు అన్ని స్థాయిలో పోటీల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రపంచ అథ్లెటిక్స్ క్రమశిక్షణ ట్రిబ్యునల్ ప్రకటించింది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య విధించిన నిషేధంపై కిప్టుమ్‌హాస్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేశాడు. సాక్ష్యాధారాలు, ఇతర సమాచారాన్ని పరిశీలించిన తర్వాత అతను డోపింగ్‌కు పాల్పడినట్టు ట్రిబ్ల్యునల్ ధ్రువీకరించింది. నాలుగు సంవత్సరాల పాటు అతనిని అథ్లెటిక్స్ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపింది.