క్రీడాభూమి

ఆంధ్రా జట్టుకు తొలి ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 11: సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ పోటీల్లో ఆంధ్రా జట్టు తొలి ఒటమి చవిచూసింది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కర్నాటక జట్టు అయిదు వికెట్ల తేడాతో ఆంధ్రా జట్టును ఓడించింది. రెండో మ్యాచ్‌లో బరోడా చేతిలో 14 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న కర్నాటక జట్టు ఈ మ్యాచ్‌లో గెలుపొంది పరువు దక్కించుకుంది. కర్నాటక జట్టులో దేవదత్ పడిక్కల్ చెలరేగి సెంచరీ సాదించడంతో 185 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 7 బంతులు ఉండగానే సునాయాసంగా చేరుకుంది. దేవదత్ పడిక్కల్ 13 ఫోర్లు, 7 సిక్సర్లతో 60 బంతుల్లో అజేయంగా 122 పరుగులు చేయడంతోకర్నాటక జట్టు 18.5 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆంధ్రా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. జట్టులో డిబి ప్రశాంత్ 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 51 బంతుల్లో 79 పరుగులు, అశ్విన్ హెబ్బర్ 7 ఫోర్లు 2 సిక్సర్లతో 44 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టకు భారీ స్కోరు అందించినప్పకి ఫలితంలేకపోయింది. బౌలింగ్‌లో స్టీఫెన్ తప్ప (రెండు వికెట్లు) మిగతా ఆంధ్రా బౌలర్లెవ్వరూ కర్నాటక బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయలేకపోయారు. మిగతా పోటీల్లో సర్వీసెస్ 94 పరుగులతో బీహర్‌పై (సర్వీసెస్ 184/7, బీహర్ 90/9), విజయనగరం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో బరోడా 33 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్ పై (బరోడా 201/4, ఉత్తరాఖండ్ 168) గెలుపొంది 4 పాయింట్లు తమ ఖాతాలో జమ చేసుకున్నాయి.