క్రీడాభూమి

అగ్రస్థానంలో గోవా జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(స్పోర్ట్స్), నవంబర్ 9: సయ్యద్ ముస్తాఖ్ ఆలీ ట్రోఫీ రెండో రోజు పోటీలో డిఫెండింగ్ ఛాంపియన్ కర్నాటక జట్టు పరాజయాన్ని చవిచూసింది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో బరోడా జట్టు 14 పరుగుల తేడాతో కర్నాటక జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బరోడా జట్టు నిర్ధేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైన కర్నాటక జట్టు 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు మాత్రమే చేసింది. బరోడా జట్టుబ్యాట్స్‌మన్‌లలో ఖేదార్ దేవ్‌దర్ 52, స్వప్నిల్ సింగ్ 36, విష్ణు సోలంకి 35 నాటౌట్, ఆదిత్య 32 పరుగులు చేయగా బౌలింగ్‌లో లుక్‌మన్ మేరీవాలా 21 పరుగులకు 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కర్నాటక జట్టులో రోహన్ కదయ్ 57, కరణ్‌నాయర్ 47, లువ్నిత్ సిసోడియా 38 పరుగులు చేశారు. రెండో మ్యాచ్‌లో సర్వీసెస్ జట్టు 6 వికెట్ల తేడాతో (ఉత్తరాఖండ్ 134/8, సర్వీసెస్ 137/4) గెలుపొందింది. విజయనగరం ఎసీ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో గోవా జట్టు 29 పరుగుల ఆధిక్యంతో (గోవా 202/4, బీహార్ 173/8) బీహార్‌పై గెలుపొంది వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో గోవా జట్టు 8 పాయింట్లతో మిగతా జట్ల కంటే ముందంజలో ఉంది.