క్రీడాభూమి

వారెవ్వా రోహిత్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్: వందో టీ20 మ్యాచ్ ఆడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ విరోచిత అర్ధ సెంచరీతో బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భార త జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముం దు టాస్ గెలిచిన టీమిండియా బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో క్రీజులోకి వచ్చిన బంగ్లా ఓపెనర్లు లిటన్ దాస్, మహ్మద్ నయాం దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించా రు. వీరిద్దరూ కలిసి 6వ ఓవర్లోనే జట్టు స్కోరును 50 పరుగు లు దాటించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రిషభ్ పంత్ విడదీశా డు. అద్భుతమైన రనౌట్‌తో లిటన్‌దాస్ (29)ను పెవిలియన్‌కు పంపాడు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 60 పరుగులను జోడించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన సౌ మ్యా సర్కార్‌తో కలిసి మహ్మద్ నయాం (36) భారత బౌలర్లను పరుగులు పెట్టించాడు. అయతే కొద్దిసేపటి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గత మ్యాచ్ హీరో, వికెట్ కీపర్ ముష్ఫీకర్ రహీం (4) చాహల్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 97 పరుగులకే బంగ్లాదేశ్ 3 కీలక వికెట్లను చేజార్చుకుం ది. ఇక తర్వాత వరుసగా సౌమ్యా సర్కార్ (30), అఫీఫ్ హుస్సేన్ (6), కెప్టెన్ మహ్మదుల్లా (30) పెవిలియన్‌కు చేరారు. మొసదీక్ హుస్సేన్ (7), అమినుల్ ఇస్లాం (5) నాటౌట్‌గా నిలవ డంతో బంగ్లా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 153 పరుగు లు చేసింది. భారత బౌలర్లలో యుజువేంద్ర చాహల్ 2 వికెట్ల ను తీయగా, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్ రెండు వికెట్లు కోల్పోయ విజయం సాధించిం ది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (85) అర్ధ సెంచరీకి తోడు, శిఖర్ ధావన్ (31) రాణించగా, లోకేష్ రాహుల్ (8, నాటౌట్), శ్రేయాస్ అ య్యర్ (24, నాటౌట్) జట్టును విజయ తీరాలకు చేర్చారు. బం గ్లాదేశ్ బౌలర్లలో అమినుల్ ఇస్లాంకు మాత్రమే 2 వికెట్లు దక్కా య. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
హిట్‌మ్యాన్ వీరవిహారం..
లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ బంగ్లాదేశ్ బౌలర్లను ఓ ఆటా డుకున్నాడు. బౌలర్లు ఎవరనేది చూడకుండా తన సహజ సిద్ధమైన బ్యాటింగ్‌తో మరోసారి రెచ్చిపోయాడు. ఈ క్రమం లో 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఓక్రమంలో సెంచరీ చేస్తాడనుకున్నా రోహిత్ శర్మ (85) పరుగుల వద్ద క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.
అత్యధిక సెంచరీ భాగస్వామ్యం..
భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు టీ20ల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసి సరికొత త ఘనత సాధించారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివర కూ నాలుగు సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరి తర్వాత ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ (3), న్యూ జిలాండ్ ఆటగాళ్లు మార్టిన్ గుప్టిల్, కేన్ విలియమ్సన్ (3), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (3), మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రో (3) ఉన్నారు.
స్కోర్ బోర్డు..

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (రనౌట్) పంత్ 29, మహ్మద్ నయాం (సీ) శ్రేయాస్ అయ్యర్ (బీ) వాషింగ్టన్ సుందర్ 36, సౌమ్యా సర్కార్ (స్టంప్/పంత్) (బీ) చాహల్ 30, ముష్ఫీకర్ రహీం (సీ) కృనాల్ పాండ్యా (బీ) చాహల్ 4, మహ్మదుల్లా (సీ) శివమ్ దుబే (బీ) చాహర్ 30, అఫీఫ్ హుస్సేన్ (సీ) రోహిత్ (బీ) ఖలీల్ అహ్మద్ 6, మొసదీక్ హుస్సేన్ (నాటౌట్) 7, అమినుల్ ఇస్లాం (నాటౌట్) 5.
ఎక్స్‌ట్రాలు: 6 మొత్తం: 153 (20 ఓవర్లలో 6 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-60, 2-83, 3-97, 4-103, 5-128, 6-142
బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-25-1, ఖలీల్ అహ్మద్ 4-0-44-1, వాషింగ్టన్ సుందర్ 4-0-25-1, యుజువేంద్ర చాహల్ 4-0-28-2, శివమ్ దుబే 2-0-12-0, కృనాల్ పాండ్యా 2-0-17-0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సీ) మిథున్ (బీ) అమిను ల్ ఇస్లాం 85, శిఖర్ ధావన్ (బీ) అమినుల్ ఇస్లాం 31, లోకేష్ రాహుల్ (నాటౌట్) 8, శ్రేయాస్ అయ్యర్ (నాటౌట్) 24.
ఎక్స్‌ట్రాలు: 6 మొత్తం: 154 (15.4 ఓవర్లలో 2 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-118, 2-125
బౌలింగ్: ముస్తాఫిజుర్ రహ్మాన్ 3.4-0-35-0, షఫియల్ ఇస్లాం 2-0-23-0, ఆల్ అమిన్ హుస్సేన్ 4-0-32-0, అమినుల్ ఇస్లాం 4-0-29-2, అఫిఫ్ హుస్సేన్ 1-0-13-0, మొసదీక్ హుస్సేన్ 1-0-21-0.
*చిత్రం...రోహిత్ శర్మ (85)