క్రీడాభూమి

భారత మహిళలదే వనే్డ సిరీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటిగ్వా, నవంబర్ 7: కరేబియాన్ పర్యటనలో భార త మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. గురువారం జరిగిన చివరి వనే్డలో 6 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండి యా, మూడు వనే్డల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసు కుంది. అంతకుముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళలు బ్యాటింగ్‌కు దిగారు. కెప్టెన్ స్టఫనీ టేలర్ (79), స్టాసీ అన్ కింగ్ (38), హెలీ మాథ్యూస్ (26) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటయ్యారు. భారత బౌలర్ల లో జులాన్ గోస్వామి, పూనమ్ యాదవ్‌లు రెండేసి వికెట్లు పడగొట్టగా, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 42.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయ విజయం సాధించింది. భారత ఓపెనర్లు స్మృతీ మంధాన (74), జెమీమా రోడ్రిగ్స్ (69) అర్ధ సెంచరీలతో రాణించారు.ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పూనమ్ రౌత్ (24), కెప్టెన్ మిథాలీరాజ్ (20) తక్కువ స్కోర్లకే పెవిలియ న్‌కు చేరినా హర్మన్ ప్రీత్‌కౌర్ (0, నాటౌట్)తో కలిసి దీప్తి శర్మ (4, నాటౌట్) జట్టును గెలిపించారు.
అతి తక్కువ ఇన్నింగ్‌ల్లో 2వేల క్లబ్‌లో..
చివరి వనే్డలో అర్ధ సెంచరీతో రాణించి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన భారత ఓపెనర్ స్మృతీ మంధాన అతి తక్కువ ఇన్నింగ్‌ల్లో 2వేల పరుగుల మైలురాయని దాటింది. స్మృతీ కేవలం 51 ఇన్నింగ్‌ల్లోనే ఈ ఫీట్ సాధించి, భారత్ బ్యాట్స్‌వుమన్స్ జాబితాలో ముందువరుసలో ఉండగా, ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచింది. స్మృతీ కంటే ముందు ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు ఉన్నారు.
*చిత్రం...స్మృతీ మంధాన (74)