క్రీడాభూమి

65 ఏళ్లలో తొలిసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 23: ఒక మాజీ క్రికెటర్ పూర్తిస్థాయ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం 65 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 1954లో టీమిండియా మాజీ కెప్టెన్, విజయనగ రం మహా రాజు విజయానంద గజపతిరాజు బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక య్యా డు. 2014లో సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. అయతే వీరు కొన్ని నెలలు మాత్రమే తాత్కాలిక అధ్యక్షు లుగా పనిచేశారు. పూర్తిస్థాయ పదవీ బాధ్యతలు చేపట్టిన గంగూలీ మరో పది నెలలు మాత్రమే పదవిలో ఉం టారు. ఇప్పటికే ఐదేళ్లకు పైగా క్రికెట్ పాలనా వ్యవహారాల్లో ఉండ డంతో లోధా కమిటీ ‘తప్పనిసరి విరామం’ నిబంధన ప్రకారం వచ్చే ఏడాది జూ లైలో పదవి నుంచి తప్పు కోవాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత తిరిగి అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు.

*చిత్రం...ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో నూతన అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో ఉపాధ్యక్షుడు మహిమ్ వర్మ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ సింగ్ ధుమల్, జాయంట్ సెక్రటరీ జయేష్ జార్జ్