క్రీడాభూమి

రోహిత్ ‘డబుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ : భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్‌లో తొలి టెస్టు డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ‘డిపెండబుల్ బ్యాట్స్‌మన్’ అజింక్య రహానే సెంచరీతో రాణించాడు. దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న చివరి, మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొమ్మిది వికెట్లకు 497 పరుగుల భారీ స్కోరువద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ వెంటనే తొలి ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా తొమ్మిది పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకొని, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ టెస్టు మొదటి రోజైన శనివారం 58 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్లకు 224 పరుగులకు చేరిన విషయం తెలిసిందే. ఈ దశలో, వెలుతురు సరిగ్గా లేకపోవడంతో మొదటి రోజు ఆట ముగిసినట్టు అంపైర్లు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, నిగెల్ లాంగ్ ప్రకటించారు. అప్పటికి రోహిత్ 117, రహానే 83 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. కాగా, ఈ ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు, ఆదివారం ఉదయం ఆటను కొనసాగించిన భారత్ 306 పరుగుల వద్ద రహానే వికెట్ కోల్పోయింది. 115 పరుగులు చేసినఅతను జార్జి లినే్డ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్‌కు చిక్కాడు. అద్వితీయ ప్రతిభాపాటవాలతో డబుల్ సెంచరీ సాధించిన రోహిత్ 212 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద కాగిసో రబదా బౌలింగ్‌లో లున్గీ ఎన్గిడీ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. 255 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో 28 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 24 పరుగులు చేసిన వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహాను జార్జి లినే్డ క్లీన్ బౌల్డ్ చేశాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 119 బంతుల్లో, 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి, జార్జి లినే్డ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగారు. రవిచంద్రన్ అశ్విన్ 14 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద, డేన్ పిడిట్ బౌలింగ్‌లో షాట్ కొట్టేందుకు క్రీజ్ నుంచి బయటకు వచ్చి, హెన్రిచ్ క్లాసెన్ స్టంప్ చేయడంతో పెవిలియన్ చేరాడు. టెయిలెండర్ ఉమేష్ యాదవ్ కేవలం 10 బంతుల్లో, ఐదు సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేసి, జార్జి లినే్డ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్‌కు దొరికాడు. షాబాజ్ నదీం (1), మహమ్మద్ షమీ (10) నాటౌట్‌గా నిలవగా, 116.3 ఓవర్లలో భారత్ 9 వికెట్లకు 497 పరుగులు చేసింది. ఆ సమయంలో వెలుతురు సరిగ్గా లేకపోవడంతో, పరిస్థితిని గమనించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు.
మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఇప్పటికే 0-2 తేడాతో చేజార్చుకున్న దక్షిణాఫ్రికా మరోసారి చిక్కుల్లో పడింది. మహమ్మద్ షమీ వేసిన మొదటి ఓవర్ రెండో బంతికే, వృద్ధిమాన్ సాహా క్యాచ్ పట్టగా డీన్ ఎల్గార్ (0) ఔటయ్యాడు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోరు నాలుగు పరుగులు. మరో నాలుగు పరుగులు జత కలిసినతర్వాత, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహా క్యాచ్ అందుకోగా క్వింటన్ డి కాక్ (4) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో జుబేర్ హమ్జా (0), కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ (1) జట్టుకు అండగా అండగా నిలిచారు. మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు. రెండో రోజు బ్యాడ్‌లైట్ కారణంగా ఆటను నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగించగా, అప్పటికి దక్షిణాఫ్రికా 5 ఓవర్లలో తొమ్మిది పరుగులు చేసి, రెండు వికెట్లు కోల్పోయింది. భారత్ కంటే ఇంకా 488 పరుగులు వెనుకంజలో నిలిచిన ఆ జట్టుకు ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నాయి.

*చిత్రం...ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ ఔటనప్పుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆనందం