క్రీడాభూమి

సైక్లిస్ట్ ట్రెవర్‌కు గౌరవ డాక్టరేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: సైక్లింగ్‌లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు పేరుప్రఖ్యాతులు అర్జించిపెట్టిన ప్రఖ్యాత సైక్లిస్ట్ మాక్స్‌వెల్ ట్రెవర్ శ్రమకు తగిన గుర్తింపు లభించింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం పనామా (యూఎస్)లోని ఇండో-అమెరికన్ యూనివర్శిటీ స్వాహిలి ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. తెలంగాణకు చెందిన ట్రెవర్ భారత దేశానికి పలు అంతర్జాతీయ వేదికలపై ప్రాతినిధ్యం వహించారు. కార్బన్ సైకిల్ లేదా కార్బన్ చక్రాలు లేకుండానే ఆయన ఒలింపిక్ రికార్డును 0.04 సెకన్ల తేడాతో బద్దలు చేసి, సైక్లింగ్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో సైక్లింగ్ ఇంకా సజీవంగా ఉందంటే దానికి ఆయన చేసిన కృషే, ఇచ్చిన స్ఫూర్తే ప్రధాన కారణమని చెప్పాలి. ఇప్పుడు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు ట్రెవర్ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయన స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సైక్లింగ్ ప్రాచుర్యం పొందుతుందనే నమ్మకం అందరిలోనూ ఉంది. కాగా, గౌరవ డాక్టరేట్ పట్టా స్వీకరించిన ట్రెవర్‌ను పలువురు సైక్లిస్టులు, అధికారులు, ప్రముఖులు ప్రశంసించారు.