క్రీడాభూమి

నదీం @ 296

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, అక్టోబర్ 19: జార్ఖండ్‌కు చెందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ షాబాజ్ నదీం టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున టెస్టుల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న 296వ ఆటగాడిగా అతను గుర్తింపు పొందాడు. సమర్థుడైన స్పిన్నర్‌గా పేరు సంపాదించిన 30 ఏళ్ల నదీం తన కెరీర్‌లో 110 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 424 వికెట్లు పడగొట్టాడు. 2015-16 రంజీ సంజన్‌లో 51, ఆతర్వాత 2016-17 సీజన్‌లో 56 చొప్పున వికెట్లు సాధించి సెలక్టర్లను ఆకర్షించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంత వరకూ 64 మ్యాచ్‌లు ఆడిన అతని ఖాతాలో 42 వికెట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు రాంచీలో శనివారం మొదలుకాగా, అతనికి తుది జట్టులో చోటు దక్కింది. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి వచ్చాడు.
*చిత్రం...షాబాజ్ నదీంను జట్టులోకి ఆహ్వానిస్తున్న టీమిండియా సభ్యులు.