క్రీడాభూమి

కోహ్లీ సేన చేతిలో వైట్‌వాష్ తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, అక్టోబర్ 18: భారత్-దక్షిణాఫ్రికా మధ్య రాంచీ వేదికగా శనివారం నుంచి జరిగే చివరిదైన మూడో టెస్టుపై కోహ్లీ సేన కనే్నసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సఫారీల ను వైట్ వైష్ చేయాలని భావిస్తోంది. మరోవైపు రాంచీ టెస్టును గెలిచి పరువు దక్కించుకో వాలని చూస్తోంది. అయతే తమ ఆటగాళ్లెవరూ ఫాంలో లేకపోవడం, స్వదేశీ పిచ్‌లు టీమిం డియాకు సహకరించడంతో కనీసం గట్టి పోటీ అయనా ఇవ్వా లనుకుంటోంది. ఇప్పటికే విశాఖ వేదికగా జరిగిన మొదటి టెస్టులో 203 పరుగుల తేడాతో పరాజయం పాలవ్వగా, పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో 137 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.
కుల్దీప్‌కు గాయం..
ఇప్పటికే మొదటి రెండు టెస్టులు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ చివరి టెస్టులో ఓ పేసర్‌ని తగ్గించి, కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించాలనుకున్నా చివర్లో కుల్దీప్ భుజం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. కుల్దీప్ స్థానం లో షాబాజ్ నదీమ్‌కు చోటు కల్పించనున్నారు. మరోవైపు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇదివరకే తన సత్తా చాటగా, ఈ టెస్టులోనూ రాణించి జట్టులో చోటును సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు.
నెం.1కు చేరువలో కోహ్లీ..
ఇదిలాఉంటే చాలా రోజుల తర్వాత టెస్టుల్లో సెంచరీ సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానానికి చేరువయ్యాడు. రెండో టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన విరాట్ 936 రేటింగ్ పాయంట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లో 700పై చిలుకు పరుగులు చేయడంతో 937 రేటింగ్ పాయంట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయతే రాంచీ టెస్టులో కోహ్లీ రాణిస్తే స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టే అవ కాశముంది.
స్పిన్, రివర్స్‌స్వింగ్‌కు అనుకూలం..
రాంచీ మైదానంలో ఇప్పటివరకు ఒక టెస్టు మాత్రమే జరిగింది. నేడు జరిగేది రెండు టెస్టు మాత్రమే. అయతే పిచ్ పొడిగా ఉండడంతో స్పిన్, రివర్స్ స్వింగ్‌కు అనుకూలించనుం దని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. అయతే జట్టులో కీలక ఆటగాడు మార్కరమ్ గాయం కారణంగా ఆడ తాడలేనిది పేర్కొనలేదు. ఇప్పటికే బౌలర్ కేశవ్ యాదవ్ కూడా గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
అన్ని విభాగాల్లో పైచేయ..
టీమిండియా ప్రస్తుతం అన్ని విభాగాల్లో పైచేయగానే ఉంది. ఓపెనర్లు రోహిత్‌శర్మ, మయాంక్ అగర్వాల్‌తో పాటు చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో బ్యాటింగ్‌లో సత్తా చాటుతుండగా, బౌలింగ్‌లో మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌తో బలంగా ఉంది.
గెలిస్తే 240 పాయంట్లు..
టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ టెస్టులో టీమిండి యా గెలిస్తే 240 పాయంట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటుంది. ప్రస్తుతం 200 పాయంట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న కోహ్లీ సేన ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటేందు కు సమాయ త్తమైంది.
హాజరుకానున్న ధోనీ..
సొంత మైదానంలో జరిగే చివరి టెస్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ హాజరుకానున్నారు. ప్రపంచకప్ తర్వాత సొంత కారణాలతో జట్టుకు దూరమైన జార్ఖండ్ డైనమేట్ రాంచీలో జరిగే టెస్టుకి మొదటి రోజు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ధోనీ ఇటీవల వెస్టిండీస్ టూరులోనూ ఆడలేదు. ఆర్మీకి సేవలందించేందుకు రెండు నెలల విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అయనా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు.