క్రీడాభూమి

తిరుగులేని కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, అక్టోబర్ 13: స్వదేశంలో భారత్ సాధించిన 11 వరుస టెస్టు సిరీస్ విజయాల్లో, కెప్టెన్‌గా కోహ్లీ అందుకున్నవే ఎక్కువ. మొదటి రెండు సిరీస్ విజయాల్లో టీమిండియాకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించాడు. ఆతర్వాత కోహ్లీ వరుసగా నాలుగు సిరీస్‌ల్లో భారత్‌ను విజయపథంలో నడిపాడు. 2016-17 సీజన్‌లో ఆస్ట్రేలియాపై భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకున్నప్పుడు, కోహ్లీతోపాటు అతను అందుబాటులో లేనప్పుడు అజింక్య రహానే భారత్‌కు నాయకత్వం వహించాడు. కాగా, 2017-18 సీజన్‌లో శ్రీలంకపై భారత్ 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. 2018లో అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో, అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆతర్వాత వరుసగా రెండు పర్యాయాలు మళ్లీ కోహ్లీ నాయకత్వంలోనే భారత్ స్వదేశంలో సిరీస్‌లను తన ఖాతాలో వేసుకుంది. మొత్తం మీద 11 సిరీస్‌ల్లో కోహ్లీ సొంతంగా ఏడు పర్యాయాలు, రహానేతో కలిసి ఒకసారి విజయాలను నమోదు చేసి, అగ్రస్థానంలో నిలిచాడు. ఇలావుంటే, ప్రత్యర్థిని ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడించడం కోహ్లీకి ఇది ఏడోసారి. ఫాలోఆన్ ఇచ్చిన ప్రతిసారీ అతను విజయాన్ని సాధించాడు.
* దక్షిణాఫ్రికాపై టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన ఆధిక్యాల్లో 347 పరుగులు మొదటి స్థానంలో ఉంది. 2009-10 సీజన్‌లో భాగంగా కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ ఈ భారీ లీడ్‌ను సంపాదించింది. కాగా, తాజా మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 601 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, తర్వాత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను మొదటి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు కట్టడి చేయడం ద్వారా 326 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అత్యధిక ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్స్‌లో ఇది రెండోది. 2015-16 సీజన్‌లో భాగంగా జరిగినఢిల్లీ టెస్టులో భారత్ 213 పరుగుల లీడ్‌ను సంపాదించింది.
* దక్షిణాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మక్రాన్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సున్నాకే (పెయిర్) ఔటయ్యాడు. దక్షిణాఫ్రికా నిషేధం అనంతరం మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత, ‘పెయిర్’ ఓపెనర్ల జాబితాలోకి మర్‌క్రాన్ చేరాడు. 2000-01 సీజన్‌లో వెస్టిండీస్‌పై గారీ కిర్‌స్టెన్ రెండు ఇన్నింగ్స్‌లోనూ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. హెర్చెల్ గిబ్స్ 2007లో ఒకసారి, 2008లో మరోసారి ‘పెయిర్’ అయ్యాడు. కాగా, డీన్ ఎల్గార్ ఇటీవలి 21 టెస్టు ఇన్నింగ్స్‌లో మొత్తం 606 పరుగులు చేయగలిగాడు. అతనితో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వారంతా కలిపి చేసిన పరుగులు కేవలం 296 మాత్రమే.

*చిత్రం...దక్షిణాఫ్రికాను పుణె టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో చిత్తుచేసి, సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సహచరులు