క్రీడాభూమి

హోం సిరీస్‌ల్లో టీమిండియా సూపర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, అక్టోబర్ 13: స్వదేశంలో టెస్టు సిరీస్ విజయాల్లో టీమిండియా అగ్రస్థానాన్ని ఆక్రమించింది. 2012-13 సీజన్‌తో మొదలైన భారత్ టెస్టు సిరీస్ విజయాలు దక్షిణాఫ్రికాపై గెలుపుతో 11కు చేరాయి. ఆస్ట్రేలియా 1994-95 సీజన్ నుంచి 2000-01 సీజన్ మధ్య కాలంలో, స్వదేశంలో వరుసగా పది సిరీస్‌లను కైవసం చేసుకుంది. అదే జట్టు 2004 నుంచి 2008-09 సీజన్ మధ్య కాలంలోనూ వరుసగా పది సిరీస్‌లను గెల్చుకుంది. వెస్టిండీస్ 1975-76 సీజన్ నుంచి 1985-86 సీజన్ మధ్య వరుసగా ఎనిమిది విజయాలను నమోదు చేసింది. కాగా, 2017 జూలై నుంచి మొదలు పెడితే, ఇప్పటి వరకూ దక్షిణాఫ్రికాకు ఇది ఆరో సిరీస్ పరాజయం. అంతకు ముందు, 1911 ఫిబ్రవరి నుంచి 1924 ఆగస్టు మధ్య కాలంలో ఏకంగా 10 సిరీస్‌లను కోల్పోయింది. అయితే, జాత్యాహంకాన్ని ప్రదర్శించిన కారణంగా నిషేధానికి గురై, తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఆ జట్టు ఎదుర్కొన్న వరుస పరాజయాల్లో ఇదే నంబర్ వన్.