క్రీడాభూమి

ఫైనల్లో రాణి ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉలాన్-ఉడే (రష్యా), అక్టోబర్ 13: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ తృటిలో స్వర్ణాన్ని కోల్పోయింది. ఆరు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిగా నిలిచిన మేరీ కోమ్ 51 కిలోల విభాగం సెమీ ఫైనల్లో పరాజయాన్ని ఎదుర్కొని, కాంస్య పతకానికి పరిమితంకాగా, ఆదివారం నాటి 48 కిలోల ఫైనల్లో మంజూ రాణి సైతం రజతకంతో సంతృప్తి చెందింది. రష్యా బాక్సర్ ఎకతెరినా పల్సెవాతో టైటిల్ కోసం తలపడిన రాణి గట్టిపోటీనిచ్చే ప్రయత్నం చేసింది. అయితే, ప్రొఫెషనల్ బాక్సర్ మాదిరి వ్యూహాత్మకంగా ఫైట్‌ను కొనసాగించిన పల్సెవాను అడ్డుకోలేక, 1-4 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ హర్యానా బాక్సర్ స్వర్ణాన్ని సాధించలేకపోయినప్పటికీ, తన శక్తి వంచన లేకుండా పోరాటాన్ని కొనసాగించి, అందరి మన్ననలు పొందింది. ఇలావుంటే, ఈ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు రాణి, మేరీ కోమ్‌తోపాటు జమునా బొరో (54 కిలోల విభాగంలో కాంస్యం), లవ్లినా బొర్గోహైన్ (69 కిలోల విభాగంలో కాంస్యం) కూడా పతకాలను సాధించారు.
*చిత్రం...ప్రత్యర్థిపై పంచ్ విసురుతున్న భారత బాక్సర్ మంజూ రాణి (కుడి)