క్రీడాభూమి

కోహ్లీ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, అక్టోబర్ 11: ఇక్కడ జరుతున్న రెండో టెస్టు రెండోరోజు ఆటలో టీమిండియా కెప్టెన్ దూకుడుకు దక్షిణాఫ్రికా కళ్లెం వేయలేకపోయింది. తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన కోహ్లీ 254 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ క్రమంలో అతను ‘లెజెండరీ క్రికెటర్’ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ రికార్డును బద్దలు చేశాడు. కెప్టెన్‌గా ఎక్కువ పర్యాయాలు 150 లేదా అంతకంటే పరుగులు చేసిన క్రికెటర్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. కెరీర్‌లో 26వ టెస్టు సెంచరీని నమోదు చేసిన భారత కెప్టెన్, ఒక కెప్టెన్‌గా 19 శతకంతో రికీ పాంటింగ్ సరసన చోటు సంపాదించాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ఘనత గ్రేమ్ స్మిత్‌కు దక్కుతుంది. అతను 25 శతకాలతో, ఈ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, 19 సెంచరీలతో కోహ్లీ, పాంటింగ్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. 15 సెంచరీలతో అలాన్ బార్డర్, స్టీవ్ వా, స్టీవ్ స్మిత్ మూడో స్థానాన్ని పంచుకుంటున్నారు.
తక్కువ ఇన్నింగ్స్‌లో కెరీర్‌లో 26వ టెస్టు సెంచరీ మైలురాయిని చేరుకున్న క్రికెటర్ల జాబితాలో కోహ్లీకి నాలుగో స్థానం దక్కింది. సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ 69 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు. స్టీవ్ స్మిత్ 121, సచిన్ తెండూల్కర్ 136 ఇన్నింగ్స్‌లో తమతమ 26వ సెంచరీలను నమోదు చేయగా, కోహ్లీకి ఇది 138వ ఇన్నింగ్స్. సునీల్ గవాస్కర్ 144, మాథ్యూ హేడెన్ 145 ఇన్నింగ్స్‌లో తమ 26 టెస్టు శతకాన్ని సాధించారు.
10 ఇన్నింగ్స్‌ల విరామం తర్వాత కోహ్లీ మళ్లీ సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికాపై స్వదేశంలో అతనికి ఇదే తొలి శతకం. అదే విధంగా ఈ ఏడాది మొదటి టెస్టు సెంచరీ.
టీమిండియా కెప్టెన్లు ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్లలో మొదటి మూడు స్థానాలను కోహ్లీయే ఆక్రమించడం విశేషం. ఈ మ్యాచ్‌లో అజేయంగా 254 పరుగులు చేసిన అతను, ఇంత కుముందు శ్రీలంకపై ఢిల్లీలో 243, ముంబైలో ఇంగ్లాండ్‌పై 235 చొప్పున పరుగులు చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైలో ఆస్ట్రేలియాపై 224 పరుగులు చేయగా, సచిన్ తెండూల్కర్ అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌పై 217 పరుగులు సాధించాడు.
కెరీర్‌లో 7,000 టెస్టు పరుగుల మైలురాయిని అధిగమించిన కోహ్లీ, అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా, గారీ సోబర్స్, కుమార సంగక్కరతో కలిసి రికార్డు పుటల్లో చోటు దక్కించుకున్నాడు. వాలీ హేమాండ్ 131, వీరేందర్ సెవగ్ 134, సచిన్ తెండూల్కర్ 136 ఇన్నింగ్స్‌లోనే ఏడు వేల పరుగులు పూర్తి చేశారు.
భారత్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా కూడా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. అతనికి ఇది కెరీర్‌లో ఏడో టెస్టు డబుల్ సెంచరీ. సచిన్ తెండూల్కర్, వీరేందర్ సెవాగ్ చెరి 6 డబుల్ సెంచరీలతో రెండో స్థానంలో నిలవగా, 5 డబుల్ సెంచరీలు చేసిన రాహుల్ ద్రవిడ్‌కు మూడో స్థానం దక్కింది. స్టార్ ఓపెనర్ గవాస్కర్ తన కెరీర్‌లో నాలుగు పర్యాయాలు మాత్ర మే టెస్టుల్లో డబుల్ సెంచరీ చేశాడు. కోహ్లీ డబుల్ సెంచరీలు వరుసగా వెస్టిండీస్ (2016/ నార్త్ సౌండ్), బంగ్లాదేశ్ (2016-17/ హైదరాబాద్), న్యూజిలాండ్ (2016-17/ ఇండోర్), శ్రీలంక (2017-18/ నాగపూర్), ఇంగ్లాండ్ (2016-17/ ముంబయి), శ్రీలంక (2017-18/ ఢిల్లీ), దక్షిణాఫ్రికా (2019/ పూణే) జట్లపై చేశాడు.