క్రీడాభూమి

అందుకే ఓడిపోయాం: మిస్బా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, అక్టోబర్ 10: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ జట్టు చెత్త ప్రదర్శనతో వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. అయతే మ్యాచ్ అనంతరం కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి కోచ్ మిస్బావుల్ హక్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీ20ల్లో నెంబర్ వన్ జట్టు అనుభవలేమీ జట్టుతో జరిగిన సిరీస్‌లో పాక్ వైట్‌వాష్ కావడానికి కారణాలెంటని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నక మిస్బా వ్యంగ్యంగా సమాధానమి చ్చాడు. అవును.. టీ20ల్లో పాకిస్తాన్ జట్టు నెంబర్ వనే. అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మారలేదు. నేను తప్ప. నేనే ఏదో తప్పుచేసుంటాను. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్లను ఎడమ చేతి వాటంతో ఆడమని, ఎడమ చేతి వాటం బౌలర్లను కుడిచేతి వాటంతో బౌలింగ్ చేయమని చెప్పానని వ్యంగ్యంగా సమాధానమి చ్చాడు. అయతే కెప్టెన్ సర్ఫరాజ్ మాట్లాడుతూ తమ వైఫల్యానికి పాక్ బోర్డు, కోచ్ తప్పేమీ లేదని, గతంలోనూ ఇదే జట్టుతో ఆడి నెంబర్ వన్‌గా ఉన్నామని, అయతే ప్రస్తు తం శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆటగాళ్లు మాత్రమే విఫలమయ్యారని పేర్కొన్నాడు.