క్రీడాభూమి

మిథాలీ సేన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, అక్టోబర్ 9: దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరుగుతున్న జరుగుతున్న మూడు వనే్డల సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. వడోదర వేదికగా బుధవారం జరిగిన తొలి వనే్డలో మిథాలీ రాజ్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. జులన్ గోస్వామి వేసిన మొదటి ఓవర్ తొలి బంతికే ఓపెనర్ లిజెల్లీ లీ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ త్రిషా చెట్టి (14) కొద్దిసేపటికే ఎక్తాబిస్త్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా పెవిలియన్ చేరింది. దీంతో 32 పరుగులకే దక్షిణాఫ్రికా జట్టు 2 కీలక వికెట్లను కోల్పోయంది. ఓవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు ఓపెనర్ లారా వాల్వార్త్, డుప్రీజ్‌తో కలిసి స్కోరు బోర్డు పెంచే బాధ్యత తీసుకుంది. వీరిద్దరూ నెమ్మదిగా ఆడే క్రమంలోనే డుప్రీజ్ (16) కూడా ఎక్తాబిస్త్ బౌలింగ్‌లోనే స్టంప్ అవుట్ అయంది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సన్ లూస్ లారా వాల్వార్త్‌తో జతకట్టింది. అయతే అప్పటివరకు నిలకడగా ఆడిన లారా వాల్వార్త్ (39) దీప్తి శర్మ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయంది. అప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయ కష్టాలో ఉన్న దక్షిణాఫ్రికాను మరిజనె్న కాప్ ఆదుకునే ప్రయత్నం చేసింది. వచ్చీ రాగానే భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ బౌండరీలను సాధించింది. ఈ క్రమంలోనే కెప్టెన్ సన్ లూస్ (22) శిఖా పాండే బౌలింగ్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి 5వ వికెట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన నదినె డీ క్లార్క్ (0), షబ్నీమ్ ఇస్మాయల్ (3), ఫంగసే (4), సెఖుఖూనే (6) సింగిల్ డిజిట్‌కే అవుట్ కాగా, మరిజనె్న కాప్ (54) అర్ధ సెంచరీతో చివరి వికెట్‌గా అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా మహిళా జట్టు 45.1 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో జులాన్ గోస్వామి 3 వికెట్లు పడగొట్టగా, శిఖా పాండే, ఎక్తాబిస్త్, పూనమ్ యాదవ్ తలా రెండేసి వికెట్లను తీయగా, దీప్తీ శర్మకు 1 వికెట్ లభించింది. ఆ తర్వాత 165 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండి యా 41.4 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయ విజయం సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు ప్రియా పూనియా (75, నా టౌట్), జెమీమా రోడ్రిగ్స్ (55) పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో మూడు వనే్డల సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.