క్రీడాభూమి

అతని వీరోచిత ఆటతీరు వీరూను తలపిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: భారత మాజీ బ్యాంటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ సోమవారం యువతేజం మయాంక్ అగర్వాల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘ఏ మాత్రం జంకులేని తెంపరితనంతో కూడిన మయాంక్ బ్యాటింగ్ తీరు వీరేంద్ర సేవాగ్‌ను తలిపిస్తోంద’ని లక్ష్మణ్ కితాబిచ్చాడు. కర్మాటక రంజీ జట్టుకు చెందిన ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నాడు. గతంలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా రెండు డబుల్ సెంచురీలతో ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్న మయాంక్ తాజాగా దక్షిణాఫ్రికాపై 215 పరుగులు సాధించి భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని భారత ప్రపంచ ప్రఖ్యాత స్పిన్నర్ హర్బజన్ సింగ్ పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌ను సైతం తన సొంత గ్రౌండ్‌లో జరిగే లోకల్ మ్యాచ్‌లా ఆడడం మయాంక్‌కే చెల్లిందని, మానసికంగా, శారీరకంగా దృఢంగా, స్థిరంగా ఉన్న తత్వం మయాంక్‌ను మరిన్ని అద్భుతాలు సృష్టించేలా చేస్తుందని లక్ష్మణ్ తెలిపాడు. బహుశా మయాంక్ అభిమానించే వీరేంద్ర సేవాగ్‌లోని తత్వాలను అతను పుణికిపుచుకుని ఉండవచ్చన్నాడు. బంతిని ముందుకొచ్చి ఆడే క్రమంలో మయాంక్ తన కాలిని అద్భుతంగా వినియోగించుకుంటున్నాడని టెక్నిక్‌లో పేర్కొందిన లక్ష్మణ్ కొనియాడాడు. ఈవిషయంలో అతని మస్తిష్కంలో మరిన్ని ఉపాయాలు దాగుంటాయని, వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగిస్తాడో వేచిచూద్దామని హర్బజన్ సింగ్ అన్నాడు. స్థిరపడిన బ్యాట్స్‌మెన్ తన సమర్థతను పెంచుకోవడంపైనే దృష్టి నిలపాలని విశాఖ మ్యాచ్‌లో రోహిత్ శర్మ విభిన్నమైన ఆటతీరును ప్రదర్శించగా, మయాంక్ తన సహజసిద్ధమైన ఆటతీరును కనబరిచాడని హర్బన్ విశే్లషించాడు.