క్రీడాభూమి

షమీ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్టణం : ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్ 203 పరుగుల భారీ ఆధిక్యంతో విజయభేరి మోగించింది. రెండో ఇన్నింగ్స్‌లో 395 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నాలుగో రోజు, శనివారం ఆట ముగిసే సమయానికి 1 వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో చివరిరోజున ఆటను కొనసాగించి 63.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. భారత మీడియం పేసర్ మహమ్మద్ షమీ 10.5 ఓవర్లు బౌల్ చేసి 35 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి, ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రవీంద్ర జడేజా 87 పరుగులకు 4 వికెట్లు సాధించాడు. రవిచంద్రన్ అశ్విన్‌కు 1 వికెట్ లభించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లలో లోయర్ మిడిలార్డర్ సెనురన్ ముత్తుస్వామి అజేయంగా 49 పరుగులు చేయగా, టైలెండర్ డేన్ ఫిడిట్ 107 బంతులు ఎదుర్కొని 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్లకు 502 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ, రోహిత్ శర్మ సెంచరీతో రాణించడంతో భారత్‌కు ఈ స్కోరు సాధ్యమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ 189 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా 131.2 ఓవర్లలో 431 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (160), వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (111) సెంచరీలు సాధించగా, కెప్టెన్ డుప్లెసిస్ (55) అర్ధ శతకంతో రాణించాడు. రవిచంద్రన్ అశ్విన్ 46.2 ఓవర్లు బౌల్ చేసి 145 పరుగులకు 7 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా 2, ఇషాంత్ శర్మ 1 చొప్పున వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాపై ఆధిపత్యాన్ని కనబరిచింది. మొదటి ఇన్నింగ్స్ సెంచరీ వీరుడు రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ నమోదు చేయడం విశేషం. చటేశ్వర్ పుజారా 81, రవీంద్ర జడేజా 40 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ 31, అజింక్య రహానే 21 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, భారత్ 67 ఓవర్లలో 323 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ప్రత్యర్థి ముందు 395 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. దీనిని అందుకోవడానికి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా కేవలం 4 పరుగుల వద్ద ఎల్గర్ (2) వికెట్‌ను కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అతను ఎల్బీగా వెనుతిరిగాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 11 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా రెండో రోజైన ఆదివారం ఉదయం ఆటను కొనసాగించి మరో 8 పరుగులు జత కలిసిన తర్వాత థియోనిస్ డి బ్రుయిన్ వికెట్‌ను కోల్పోయింది. 25 బంతులు పరుగులు చేసిన అతను అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టెంబా బవూమా పరుగుల ఖాతా తెరవకుండానే షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ పఫ్ డుప్లెసిస్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేక, 26 బంతుల్లో 13 పరుగులు చేసి షమీ వేసిన అద్భుతమైన ఇన్ స్వింగర్‌కు బౌల్డ్ అయ్యాడు. అదే ఊపులో క్వింటన్ డికాక్ (0)ను కూడా షమీ బౌల్డ్ చేశాడు. క్రీజులో పాతుకుపోవడానికి విశేషంగా ప్రయత్నించిన ఓపెనర్ ఎయిడెన్ మర్‌క్రామ్ 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రిటన్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ముత్తుస్వామి భారత్ బౌలింగ్‌ను సమర్ధంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుండగా, వెర్నర్ ఫిలాండర్ (0), కేశవ్ మహారాజ్ (0) వికెట్లను రవీంద్ర జడేజా సాధించాడు. టైలెండర్ డేన్ ఫిడిట్ జట్టును ఆదుకునే బాధ్యతను స్వీకరించాడు. ముత్తుస్వామి కూడా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. 107 బంతుల్లో 56 పరుగులు చేసి, మహమ్మద్ షమీ బౌలింగ్‌లో పిడిట్ బౌల్డ్ అయ్యాడు. చివరిలో కాగిసో రబడ 18 పరుగులకు షమీ బౌలింగ్‌లోనే వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరగడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 63.5 ఓవర్లలో 191 పరుగుల వద్ద ముగిసింది. ముత్తుస్వామి 108 బంతులు ఎదుర్కొని 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. షమీ 5, జడేజా 4 చొప్పున వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టును దారుణంగా దెబ్బతీశారు. వీరు అద్భుతంగా రాణించడంతో భారత్‌కు 203 పరుగుల ఆధిక్యంతో ఘన విజయం లభించింది. కాగా అత్యధిక సిక్స్‌లు నమోదైన టెస్టుగా భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ గుర్తింపు సంపాదించింది. ఈ మ్యాచ్‌లో 36 సిక్సర్లు నమోదయ్యాయి.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 136 ఓవర్లలో 7 వికెట్లకు 502 డిక్లేర్డ్ (మయాంక్ అగర్వాల్ 215, రోహిత్ శర్మ 176, రవీంద్ర జడేజా 30 (నాటౌట్), కేశవ్ మహారాజ్ 3/189). దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 131.2 ఓవర్లలో 431 ఆలౌట్ (డీన్ ఎల్గార్ 160, ఫఫ్ డుప్లెసిస్ 55, క్వింటన్ డికాక్ 111, ముత్తుస్వామి 33 నాటౌట్, రవిచంద్రన్ అశ్విన్ 7/145, రవీంద్ర జడేజా 2/144). భారత్ రెండో ఇన్నింగ్స్: 67 ఓవర్లలో 4 వికెట్లకు 323 డిక్లేర్డ్ (రోహిత్ శర్మ 127, చటేశ్వర్ పుజారా 81, రవీంద్ర జడేజా 40, విరాట్ కోహ్లీ 31 నాటౌట్, అజింక్య రహానే 27 నాటౌట్, కేశవ్ మహారాజ్ 2/129). దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 1/11, లక్ష్యం 395): 63.5 ఓవర్లలో 191 ఆలౌట్ (ఎయిడెన్ మర్‌క్రామ్ 39, సెనురన్ ముత్తుస్వామి 49 నాటౌట్, డేన్ ఫిడిట్ 56, రవీంద్ర జడేజా 4/87, మహమ్మద్ షమీ 5/35).
* గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఒక టెస్టు
ఇన్నింగ్స్‌లో షమీ మూడుసార్లు 5 లేదా అంతకంటే
ఎక్కువ వికెట్లు సాధించాడు.
15 రెండో ఇన్నింగ్స్‌లలో 40 వికెట్లు సాధించి
మరే ఇతర భారత బౌలర్ సాధించని రికార్డును
తన పేరిట నమోదు చేసుకున్నాడు.
*
భారత్‌లో టీమిండియాపై 10వ లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన 5వ బ్యాట్స్‌మన్‌గా డేన్ ఫిడిట్ రికార్డు పుస్తకంలో చోటు సంపాదించాడు. హెడ్లీ వెరిటి (ఇంగ్లాండ్) 56 పరుగులు చేశాడు. 1983లో యాండీ
రాబర్ట్స్ (వెస్టిండీస్) 67 పరుగులు
సాధించాడు. 1997లో గెవిన్ రాబర్ట్‌సన్ 57 పరుగులు
సాధించగా, తాజాగా విశాఖపట్టంలో
జరిగిన టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు
డేన్ ఫిడిట్ 56 పరుగులు చేశాడు.
*స్వదేశంలో జరిగిన ఓ టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్
5 లేదా అంతకు మించి వికెట్లు పడగొట్టిన సంఘటన చివరిసారి 1996లో నమోదైంది. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై జవగళ్ శ్రీనాథ్ ఈ ఫీట్‌ను సాధించాడు. తాజాగా, మహమ్మద్ షమీ 5 వికెట్లు
పడగొట్టాడు. మొత్తమీద ఈ జాబితాలో వీరిద్దరితోపాటు కర్సన్ ఘావ్రీ, కపిల్‌దేవ్, మదన్‌లాల్ ఉన్నారు.
ఐ*చిత్రం... దు వికెట్ల హీరో షమీ