క్రీడాభూమి

రోహిత్ ఆట భేష్: విరాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(స్పోర్ట్స్), అక్టోబర్ 6: తొలి టెస్టుమ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసిన విధానాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. మ్యాచ్ అనంతరం ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లో చేసిన సెంచరీలు, మయాంక్ అగర్వాల్ బ్రిలియంట్ డబుల్ సెంచరీ తొలి ఇన్నింగ్స్‌లో 500 పరుగుల భారీ స్కోర్ సాధించడం ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచేందుకు ఉపకరించిందన్నారు. అశ్విన్, జడేజా అద్భుత స్పిన్ బౌలింగ్‌తో 14 వికెట్లు పడగొట్టడం జట్టు విజయానికి కీలమైందన్నారు. ఊహించినట్టుగానే రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ స్పిన్నర్లకు సహకరించిందన్నారు. జట్టులో ప్రతి ఆటగాడు మ్యాచ్ విజయానికి చెమటోడ్చారని, ముఖ్యంగా బౌలర్లు ఈ మ్యాచ్‌లో కీలక భూమిక పోషించారని కొహ్లి అన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌లో జరిగిన హోం లెగ్ టెస్టు సిరీస్ విజయంతో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నాడు. టెస్ట్ మ్యాచ్‌ల్లో ఎల్జీ బాల్‌ను ఉపయోగించడం మంచిదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
రవిశాస్ర్తీ, కోహ్లీకి కృతజ్ఞతలు
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మ ప్రజెంటేషన్ సెర్మనీలో మాట్లాడుతూ ఈ టెస్ట్‌మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా దిగేందుకు తనకు అవకాశం ఇచ్చిన ప్రధాన కోచ్ రవిశాస్ర్తీ, కెప్టెన్ విరాట్ కోహ్లీలకు కృతజ్ఞతలు తెలిపాడు. గత రెండేళ్లుగా తాను టెస్ట్ మ్యాచ్ ఓపెనర్‌గా దిగేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిస్తూనే ఉన్నానని, తాను టెస్టుల్లో పాల్గొనప్పుడు కూడా నెట్స్‌లో కొత్త రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తూండే వాడినని రోహిత్ తెలిపాడు. క్రికెట్ బేసిక్స్‌కు కట్టుబడి జాగ్రత్తతో కూడిన దూకుడు కలగలుపుగా ఆడటం విజయానికి కారణంగా పేర్కొన్నాడు.

*చిత్రం... మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటున్న రోహిత్ శర్మ