క్రీడాభూమి

మొదటి వనే్డ ఆసిస్ మహిళలదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్స్, అక్టోబర్ 5: శ్రీలంక మహిళలతో శనివారం జరిగిన మొదటి వనే్డలో ఆసిస్ మహిళలు 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మహిళా జట్టు నిర్ణిత ఓవర్లలో 8 వికెట్లను నష్టపోయ 281 పరుగులు చేసింది. ఓపెనర్ హేన్స్ (56)తో పాటు కెప్టెన్ మెగ్ లన్నింగ్ (73), బెత్ మూనీ (66)లు అర్ధ సెంచరీలతో రాణిం చారు. శ్రీలంక బౌలర్లలో ప్రభోదిని, ఒషాడి రణసింగే రెండేసి వికెట్లు తీయగా, కులసూరియా, రణవీర, శశికళ సిరివర్దనే తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక జట్టు 41.3 ఓవర్లలోనే 124 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ శశికళ సిరివర్దనే (30), హర్షిత మాధవి (22) తప్ప ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో 157 పరుగుల తేడాతో లంక మహిళా జట్టుకు పరాజయం తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో తైలా విమ్లింక్, జెస్ జానసేన్, ఆష్లే గర్డ్నర్‌లు తలా రెండేసి వికెట్లు తీయగా, ఎలీసె పెర్రీ, జార్జియా వారిహామ్ ఒక్కో వికెట్‌ను పడగొట్టారు.
*చిత్రం...అర్ధ సెంచరీలతో మెరిసిన మెగ్ లన్నింగ్, బెత్ మూనీ