క్రీడాభూమి

హైదరాబాద్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 5: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఓటమి పాలైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టులో కెప్టెన్ అంబటి రాయుడు (69), ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (34) మాత్రమే రాణించగా, అక్షాంత్ రెడ్డి (25), భవనాక సందీప్ (21) ఫర్వాలేదనిపించడంతో 34 ఓవర్లలో హైదరాబాద్ 7 వికెట్లు నష్టపోయ 192 పరుగులు చేసింది. అయతే మధ్యలో వర్షం అడ్డు రావడంతో మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జార్ఖండ్ జట్టు మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జార్ఖండ్ బ్యాట్స్‌మెన్లలో కుమార్ డియోబ్రత్ (56), సౌరభ్ తివారీ (61) అర్ధ సెంచరీలతో రాణించారు.