క్రీడాభూమి

రోహిత్ ‘తీన్‌మార్!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 5: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో అదరగొడుతున్నాడు. మొదటిసారి టెస్టుల్లో ఓపెనర్‌గా దిగిన ఈ హిట్ మ్యాన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించి సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే మూడు ఫార్మాట్లలో భారత్ తరఫున సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్లలో రోహిత్ ఒక్కడే ఉండగా, ప్రస్తుతం ఇదే మూడు ఫార్మాట్లలో ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు సంధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డును నెలకోల్పాడు. మరోవైపు ఓపెనర్‌గా ఓ టెస్టులో అత్యధిక పరుగులు సాధించిన ఘనతనూ రోహిత్ సొంతం చేసుకు న్నాడు. ఇదిలాఉంటే ఓవర్ నైట్ స్కోర్ 385/8 పరుగులతో శనివారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో 46 పరుగులను మాత్రమే చేసి 431 పరుగులకు ఆలౌటౌంది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 7 వికెట్లు పడగొట్టగా రవీంద్ర జడేజా 2, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీసుకున్నారు.
వనే్డను తలపించారు..
91 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత జట్టు బ్యాట్స్‌మెన్లు నాలుగో రోజు కావడంతో తమ శైలికి భిన్నంగా వనే్డ తరహా ఆడారు. మరీ ముఖ్యంగా టెస్ట్ స్పెషలిస్ట్, నయా వాల్ చతేశ్వర్ పుజారా (81) ప్రోటీస్ బౌలర్లపై చెలరేగాడు. పుజారా చేసిన 81 పరుగుల్లో 64 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం. మరోవైపు మొదటి ఇన్నింగ్‌లో డబుల్ సెంచరీ సాధించిన మాయాంక్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కేవలం 7 పరుగుల వద్ద మహరాజ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
హిట్ మ్యాన్ సూపర్ ఇన్నింగ్స్..
చాలా రోజుల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన రోహిత్ ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అంతేకాదు తను టెస్టులకి పనికిరాడన్న వారందరికీ మొదటి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతోనే సమాధానమిచ్చాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగినా ఏమాత్రం చెదరకుండా మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ సాధించి తన బ్యాటింగ్ పదునేంటో చూపించాడు. మరీ ముఖ్యమంగా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 149 బంతుల్లోనే 13 బౌండరీలు , రెండు సిక్సర్ల సాయంతో 127 పరుగులు చేసి, మళ్లీ మహరాజ్ బౌలింగ్‌లో కీపర్ డీకాక్ చేతిలో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (40), కెప్టెన్ కోహ్లీ (31, నాటౌట్), అజింక్యా రహానే (27, నాటౌట్) రాణించారు. ఈ క్రమంలో జట్టు స్కోరు 323 పరుగులు మొదటి ఇన్నింగ్‌లో వచ్చిన 91 పరుగుల ఆధిక్యంతో కలిపి 414 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికాకు నిర్దేశించారు. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2 వికెట్లను పడగొట్టగా, వెర్నర్ ఫిలాండర్, కగిసో రబద చెరో వికెట్ తీసుకున్నారు.
ఆదిలోనే ఎదురుదెబ్బ..
414 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఇన్నింగ్స్ సెంచరీ హీరో, ఓపెనర్ డీన్ ఎల్గర్ (2) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలో 1 వికెట్ కోల్పోయ 11 పరుగులు చేశా రు. చివరి రోజు విజయం సాధించాలంటే దక్షిణాఫ్రికాకు 384 పరుగులు అవసరం కాగా, భారత్ 9 వికెట్ల దూరంలో ఉంది.
**
స్కోర్ బోర్డు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 502/7 డిక్లేర్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: డీన్ ఎల్గర్ (సీ) పుజారా (బీ) రవీంద జడేజా 160, అయడెన్ మార్కరమ్ (బీ) అశ్విన్ 5, థీనస్ డీబ్రైన్ (సీ) సాహా (బీ) అశ్విన్ 4, డీన్ పీడ్త్ (బీ) రవీంద్ర జడేజా 0, టెంబ బవుమా (ఎల్‌బీడబ్ల్యూ) (బీ) ఇషాంత్ 18, ఫఫ్ డుప్లెసిస్ (సీ) పుజారా (బీ) అశ్విన్ 55, క్వింటన్ డికాక్ (బీ) అశ్విన్ 111, సినారన్ ముత్తుస్వామి (నాటౌట్) 33, వెర్నర్ ఫిలాండర్ (బీ) అశ్విన్ 0, కేశవ్ మహారాజ్ (సీ) మాయాంక్ అగర్వాల్ (బీ) అశ్విన్ 9, కగిసో రబద (ఎల్‌బీడబ్ల్యూ) (బీ) అశ్విన్ 15.
ఎక్స్‌ట్రాలు: 21, మొత్తం: 431 (131.2 ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-14, 2-31, 3-34, 4-63, 5-178, 6-342, 7-370, 8-376, 9- 396, 10-431.
బౌలింగ్: ఇషాంత్ శర్మ 16-2-54-1, మహ్మద్ షమీ 18-4-47-0, రవిచంద్రన్ అశ్విన్ 46.2-11-145-7, రవీంద్ర జడేజా 40-5-124-2, హనుమ విహారి 9-1-38-0, రోహిత్ శర్మ 2-1-7-0.
భారత్ రెండో ఇన్నింగ్స్: మాయాంక్ అగర్వాల్ (సీ) డుప్లెసిస్ (బీ) మహరాజ్ 7, రోహిత్ శర్మ (స్టంప్) (బీ) మహరాజ్ 127, చతేశ్వర్ పుజారా (ఎల్‌బీడబ్ల్యూ) (బీ) ఫిలాండర్ 81, రవీంద్ర జడేజా (బీ) రబద 40, విరాట్ కోహ్లీ (నాటౌట్) 31, అజింక్యా రహానే (నాటౌట్) 27.
ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 323 (67 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి)
వికెట్ల పతనం: 1-21, 2-190, 3-239, 4-286,
బౌలింగ్: వెర్నర్ ఫిలాండర్ 12-5-21-1, కేశవ్ మహారాజ్ 22-0-129-2, కగిసో రబద 13-3-41-1, డీన్ పీడ్త్ 17-3-102-0, సినారన్ ముత్తుస్వామి 3-0-20-0.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: అయడెన్ మార్కరమ్ (బ్యాటింగ్) 3, డీన్ ఎల్గర్ (ఎల్‌బీడబ్ల్యూ) (బీ) రవీంద్ర జడేజా 2, థీనస్ డీబ్రైన్ (బ్యాటింగ్) 5.
ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 11 (9 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి)

*చిత్రం...రోహిత్ శర్మ (127)