క్రీడాభూమి

అభిమాని హంగామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు రెండో సెషన్‌లో అభిమాని ఒకరు మైదానంలోకి ఒక్కసారిగా దూసుకు వచ్చాడు. బౌండరీ లైన్ వద్ద రక్షణ కంచెను దాటుకుని మైదానంలో కోహ్లీ ఉన్నచోటుకు పరుగున చేరుకున్నాడు. వస్తూనే కోహ్లీతో కరచాలనం చేసి, అమాంతం ఆలింగనం చేసుకున్నాడు. అప్పటికే విస్తుపోయిన కోహ్లీ అభిమాని చేష్టలకు నవ్వుతూనే భుజం తట్టి బయటకు వెళ్లమన్నట్టు సూచించాడు. అయినప్పటికీ వీరాభిమాని మైదానంలో నిలుచుని సెల్ఫీలు తీసుకుంటూ హంగామా చేశాడు. ఈలోగా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఆ అభిమానిని స్టేడియం బయటకు పంపించాడు. అయితే అప్పటికే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఈ వీరాభిమానికి అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.