క్రీడాభూమి

మరచిపోలేని ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), అక్టోబర్ 3: విశాఖ టెస్ట్‌లో తన డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ మరచిపోలేని అనుభూతిని కలిగిస్తోందని టీమిండియా ఓపెనర్ మాయాంక్ అగర్వాల్ అన్నాడు. బ్యాటింగ్‌లో రాణించి జట్టుకు భారీ స్కోరు అందించడంలో తాను భాగస్వామి అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. గురువారం రెండోరోజు ఆట ముగిశాక అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ 100 పరుగులు సాధించే వరకు జాగ్రత్తగా ఆడానని, ఆ తరువాత ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశానన్నాడు. రోహిత్, తాను సమన్వయంతో ఆడటం ఎంతో ప్రయోజనం కలిగించిందని, క్రీజ్‌లో నిలదొక్కుకుని తొలి వికెట్‌కు 300 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం సంతోషాన్నిచ్చిందన్నాడు. తాను డబుల్ సెంచరీ సాధించడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ తనను అభినందించాడని చెప్పాడు. తొలి రెండు రోజుల్లో బ్యాటింగ్, బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం సాధించి, ఆ జట్టుపై వత్తిడి పెంచగలిగామని విలేఖరుల అడిగిన ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నాడు.

*చిత్రం... మాయాంక్