క్రీడాభూమి

రో‘హిట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: అందరి అంచనాలు తలకిందులు చేస్తూ టెస్టుల్లో ఓపెనర్‌గా రో‘హిట్’ శర్మ అదరగొట్టాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం నుంచి విశాఖ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజే సెంచరీ సాధించి రెడ్ బాల్ క్రికెట్‌లోనూ తనేంత ప్రమాదకరమైన ఆటగాడో ప్రత్యర్థి జట్టుకు రుచి చూపించాడు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అందరూ ఊహించినట్లుగానే రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. మొదట్లో వీరిద్దరూ నెమ్మదిగానే ఆ డినా టీ బ్రేక్ తర్వాత రోహిత్ శర్మ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో బౌండరీ కొట్టి అర్ధ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ, ఆ తర్వాత సఫారీ బౌలర్లను పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో యువ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ సైతం అలవోకగా ఆడుతూ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొదట్లో సింగిల్స్, డబుల్స్‌కే ప్రాధాన్యమిచ్చినా ఈ జోడీ ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశమివ్వకుండా బౌండరీలు, సిక్సర్లను బాదుతూ ప్రేక్షకులను అలరించింది. రెండో సెషన్లో మరింత ధాటిగా ఆడిన టీమిండియా ఓపెనర్లు మొదటిరోజే 400 పై చిలుకు పరుగులు రాబట్టేలా కనిపించారు. ఈ దశలో ముత్తుస్వామి వేసిన 54వ ఓవర్లో చివరి బంతికి సింగిల్ తీసిన రోహిత్ శర్మ టెస్టుల్లో నాలుగో సెంచరీని నమోదు చేశాడు. అయతే రోహిత్‌కి ఓ పెనర్‌గా మాత్రం ఇదే తొలి సెంచరీ. అయతే ఊహించని విధంగా వరుణుడు అడ్డుకోవడంతో తొలి రోజు మరో సెషన్ మిగిలి ఉండగానే ఆటను ముగించారు. అప్పటికీ భారత్ 59.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. రోహిత్ (115, నాటౌట్), మయాంక్ అగర్వాల్ (84, నాటౌట్) క్రీజులో ఉన్నారు.
అందరి చూపు హిట్‌మ్యాన్‌పైనే..
తొలి టెస్టులో కేఎల్ రాహుల్‌ని కాదని రోహిత్ శర్మను టీమ్ మేనేజ్‌మెంట్ ఎంపిక చేసినపుడే కొందరు మాజీలు రోహిత్ టెస్టులకు పనికి రాడంటూ కామెంట్లు చేశారు. వారి మాటలకు తగ్గట్లుగానే మొదటి టెస్టుకు ముందు జరిగిన త్రీడే మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. అయతే అభిమానుల్లోనూ ఒకింత ఆందోళన నెలకొం ది. అసలు టెస్టు జట్టులో చోటు దొరకడమే సంతోషంగా భావించిన అభిమానులు రోహి త్ ఓపెనింగ్ చేస్తాడని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటిం చడంతో నిరాశ వ్యక్తం చేశారు. ఇంతకుముందు 27 టెస్టు మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 1585 పరుగులు మాత్రమే చేసి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఎవరె న్ని విమర్శలు చేసినా అవేమీ పట్టించుకోకుండా మొదటి టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన హిట్‌మ్యాన్ సెంచరీతో అందరి నోళ్లు మూయంచినట్లయంది. ఈ సెంచరీతో రోహిత్ అభిమానుల్లోనూ హర్షం వ్యక్తమైంది.

*చిత్రం...రోహిత్ శర్మ (115, నాటౌట్)