క్రీడాభూమి

టెస్ట్ మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), సెప్టెంబర్ 30: భారత్-దక్షిణాప్రికా జట్ల మధ్య అక్టోబర్ 2 నుండి జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్, నిర్వాహక కమిటీ చైర్మన్ వి. వినయ్ చంద్ పేర్కొన్నారు. పోటీకి వేదికైన ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా 7 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రత, ఆహారం ఏర్పాట్లు, వర్షం వస్తే గ్రౌండ్‌లో తీసుకోవలసిన ప్రత్యేక ఏర్పాట్లు, విద్యార్థులకు ఉచిత ప్రవేశం, ప్లాస్టిక్ స్థానంలో పేపర్ కప్, ప్లేట్ల వినియోగం, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్ళింపువంటి ప్రధానమైన విషయాలపై నిర్వాహక కమిటీ చర్చించి అనేక నిర్ణయాలను తీసుకుందన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రా క్రికెట్ సంఘం నూతన అధ్యక్షుడు పి.శరత్ చంద్రరెడ్డి, కార్యదర్శి వి.దుర్గా ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ బి.సృజన, సీపీ ఆర్కే మీనా, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు భారత్, దక్షిణాప్రికా జట్లు సోమవారం ముమ్మరంగా సాధన చేశాయి. ఉదయం 11 గంటలకు దక్షిణాప్రికా జట్టు ఏసీఏ బి గ్రౌండ్ నెట్స్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు సాధన చేయగా, భారత్ జట్టు మధ్యా హ్నం 2 గంటలకు ఏసీఏ-వీడీసీఏ ప్రధాన స్టేడియంలో ఫిట్‌నెస్ అనంతరం బి గ్రౌండ్‌లో నెట్ ప్రాక్టీస్ చేసింది. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా నెట్స్‌లో చెమటోడ్చారు.
*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్, నిర్వాహక కమిటీ చైర్మన్ వినయ్‌చంద్