క్రీడాభూమి

హాకీ జూనియర్ టీమ్ కెప్టెన్‌గా మణిదీప్ మోర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: మలేసియా వేదికగా అక్టోబర్ 12 నుంచి 19 వరకు జరిగే సుల్తాన్ జోహోర్ కప్ హాకీ సుల్తాన్ టోర్నీకి భారత జూనియర్ జట్టు కెప్టెన్‌గా మణిదీప్ మోర్ పేరును సెలక్షన్ కమిటీ ఖరారు చేసింది. టోర్నీకి మొత్తం 18 మందితో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. వైస్ కెప్టెన్‌గా సంజయ్ పేరును చేర్చింది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో భారత్ మలేసియా, న్యూజిలాండ్, జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్ జట్లతో తలపడనుంది. గత టోర్నీలో మ్యాడ్రిడ్ వేదికగా జరిగిన 8వ ఎడిషన్‌లో భారత జట్టు నిరాశపర్చగా, ఈ టోర్నీపై ఆశలు పెట్టుకుంది. భారత జట్టు ప్రదర్శనపై కోచ్ బీజే కరియప్పా నమ్మకంతో ఉన్నాడు.
భారత జూనియర్ హాకీ జట్టు:
గోల్ కీపర్స్: ప్రశాంత్ కుమార్ చౌహాన్, పవన్
డిఫెండర్స్: సంజయ్ (వైస్ కెప్టెన్), దినచంద్ర సింగ్ మొయరాంగ్తేమ్, ప్రతాప్ లక్రా, సుమన్ బేక్, మణిదీప్ మోర్ (కెప్టెన్), యష్‌దీప్ సివాచ్, శారదానంద్ తివారీ.
మిడ్ ఫీల్డర్లు: విష్ణుకాంత్ సింగ్, రబిచంద్ర సింగ్ మొయరాంగ్తేమ్, మణిందర్ సింగ్.
ఫార్వార్డ్: దిల్‌ప్రీత్ సింగ్, సుదీప్ చిర్మాకో, గుర్‌సాహ్బి జిత్ సింగ్, ఉత్తమ్ సింగ్, రాహుల్ కుమార్ రాజ్‌భార్, శైలానంద్ లక్రా.