క్రీడాభూమి

స్ప్రింట్ విజేత కోల్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా, సెప్టెంబర్ 29: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురుషుల 100 మీటర్ల పరుగులో అమెరికా స్ప్రింటర్ క్రిస్టియన్ కోల్మన్ టైటిల్ సాధించాడు. తన సహచరుడు, ఈ రేస్‌ను గెల్చుకున్న అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా పండితులు ఊహించిన జస్టిన్ గాట్లిన్‌ను రెండో స్థానానికి నెట్టి, ప్రపంచ స్ప్రింట్ విజేతగా అవతరించాడు. ఆండ్రె డి గ్రాసీకి కాంస్య పతకం లభించింది. కోల్మన్ 100 మీటర్లను 9.76 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యుత్తమ టైమింగ్ కావడం గమనార్హం. గాట్లిన్ 9.89 సెకన్లతో రన్నరప్‌గా నిలిచాడు. కెనడాకు చెందిన గ్రాసీ 9.90 సెకన్లలో లక్ష్యాన్ని చేరి, కాంస్య పతకాన్ని అందుకున్నాడు.
పురుషుల లాంగ్ జంప్ ఈవెంట్‌ల జమైకా అథ్లెట్ తాజయ్ గేల్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. అతను 8.69 మీటర్ల దూరాన్ని లంఘించాడు. జెఫ్ హాండెర్సన్ (అమెరికా) 8.39 మీటర్లతో రజతాన్ని, జువాన్ మిగుల్ (క్యూబా) 8.34 మీటర్లతో కాంస్యాన్ని అందుకున్నారు.

*చిత్రం...100 మీటర్ల స్ప్రింట్‌లో మొదటి రెండు స్థానాలను ఆక్రమించిన
క్రిస్టియన్ కోల్మన్ (ఎడమ), జస్టిన్ గాట్లిన్