క్రీడాభూమి

డియానా సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా, సెప్టెంబర్ 29: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ మహిళల హ్యామర్ త్రో ఈవెంట్‌లో అమెరికాకు చెందిన డియానా ప్రైస్ సంచలనం సృష్టించింది. అందరి అంచనాలనూ తారుమారు చేస్తూ, హ్యామర్‌ను 77.54 మీటర్ల దూరానికి విసిరిన ఆమె స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. పోలాండ్ అథ్లెట్ జొన్నా ఫ్లోడొరో 76.35 మీటర్లతో రజత పతకాన్ని గెల్చుకుంది. హ్యామర్‌ను 74.76 మీటర్ల దూరానికి విసిరిన వాంగ్ జెంగ్ (చైనా)కు కాంస్య పతకం లభించింది.
మహిళల 10,000 మీటర్ల పరుగులో నెదర్లాండ్స్ అథ్లెట్ సిఫాన్ హసన్ విజేతగా నిలిచింది. ఆమె లక్ష్యాన్ని 30 నిమిషాల, 17.62 సెకన్లలో పూర్తి చేసింది. ఇథియోపియాకు చెందిన లెటెసెనె్బన్ గిడే 30 నిమిషాల, 21.23 సెకన్లలో చేరుకొని రజత పతకాన్ని సాధించింది. 30 నిమిషాల 25.20 సెకన్లలో గమ్యాన్ని పూర్తి చేసిన ఏంజెల్ జెబెట్ టిరొప్ (కెన్యా)కు కాంస్య పతకం దక్కింది.
మహిళల మారథాన్‌లో కెన్యా మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఆ దేశానికి చెందిన రుథ్ చెపెగ్నెటిచ్ 2 గంటల, 32.43 నిమిషాల్లో మారథాన్‌ను పూర్తి చేసి, టైటిల్‌ను కైవసం చేసుకుంది. బహ్రైన్ అథ్లెట్ రోజ్ చెలిమో 2 గంటల, 33.46 సెకన్లతో రజత పతకాన్ని గెల్చుకుంది. నమీబియాకు చెందిన హెలాలియా జొహానెస్ 2 గంటల 34.15 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకొని కాంస్య పతకాన్ని స్వీకరించింది.