క్రీడాభూమి

మొమొతాకు టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, సెప్టెంబర్ 29: జపాన్ ఆటగాడు కెన్టో మొమొతా ఇక్కడ జరిగిన కొరియా ఓపెన్ బాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన అతను ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ చౌ తియాన్ చెన్ (తైవాన్)ను 21-19, 21-17 తేడాతో, వరుస సెట్లలో ఓడించాడు. ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ అతను మళ్లీ అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటడం విశేషం. ఈమ్యాచ్‌ని కేవలం 53 నిమిషాల్లోనే ముగించిన మొమొతో 2016లో ఒక అనధికార కాషియానోకు వెళ్లినందుకు సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఏడాది పాటు అతను బాడ్మింటన్‌కు దూరమయ్యాడు. ఫలితంగా అదే ఏడాది జరిగిన రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయాడు. సస్పెన్షన్‌ను ముగించుకొని, మళ్లీ కెరీర్‌ను కొనసాగించిన అతను మళ్లీ పూర్వ వైభవాన్ని కొనసాగిస్తున్నాడు.
ఇలావుంటే, మహిళల సింగిల్స్ టైటిల్ చైనాకు చెందిన హీ బియాంగ్‌జియావో గెల్చుకుంది. ఆమె ఫైనల్లో రచానొక్ ఇంతనాన్‌ను 18-21, 24-22, 21-17 తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా కొనసాగింది.