క్రీడాభూమి

రోహిత్.. నాలా తప్పు చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: సహాజ శైలికి భిన్నంగా ఆడి తనలా తప్పు చేయొద్దని టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మకు మాజీ ఆటగాడు వీవీ ఎస్ లక్ష్మణ్ సూచించాడు. 1996-98 మధ్య కాలంలో మేనేజ్‌మెంట్ ఒత్తిడి మేరకు తను ఓపెనింగ్ చేశాన ని, అప్పటికీ కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడడంతో దారుణంగా విఫ లమైన ట్లు గుర్తుచేశాడు. ఆ తర్వాత మిడిలార్డర్ వచ్చి 134 టెస్టుల్లో 8791 పరుగులు చేసి నట్లు చెప్పాడు. అయ తే దక్షిణాఫ్రికాతో అక్టోబర్ 2 నుంచి జరిగే టెస్ట్ సిరీస్‌లో మొదటిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న రోహిత్ శర్మకు లక్ష్మణ్ పలు సలహా లు, సూచనలు చేశాడు. గతంలో టెస్టు మ్యాచ్‌లాడిన రోహిత్ మిడిలా ర్డర్ లోనే బ్యాటింగ్‌కు దిగాడు. రానున్న టెస్ట్ సిరీస్‌లో మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనిం గ్ చేయ నున్న విషయం తెలిసిందే. ఈ సంద ర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ‘రోహి త్‌పై తప్పకుండా ఒత్తిడి ఉంటుంది. అయతే తన సహజశైలికి భిన్నంగా ఆడితే మాత్రం కష్టమే. 12 ఏళ్ల అనుభవమున్న రోహిత్ ఇప్పటికే వనే్డ, టీ20ల్లో ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. అయతే 5 రోజుల మ్యాచ్‌లో అలా ఆడడం కష్టమేనైనా, తన సహజ శైలి లో ఆడితే ఒత్తిడి లేకుండా ఆడతాడు’ అని పేర్కొన్నాడు.