క్రీడాభూమి

తెలిసే నిర్లక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాఫ్రికాతో టీ20లో సిరీస్‌లో భాగంగా కోహ్లీ తప్పిదంతో చివరి మ్యాచ్‌లో పర్యాటక జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ గెలుద్దాం అనుకు న్న అభిమానుల ఆశలు అడియాసలయ్యయి. బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ ముందుగా బ్యాటిం గ్ తీసుకున్నాడు. అయతే చేజింగ్ పిచ్‌లో కోహ్లీ తీసుకున్న నిర్ణయం ఆటగాళ్లతో పాటు, అభిమానులను ఆశ్చర్య పరిచింది. అంతా అనుకున్నట్లు గానే మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 134 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత ఛేదనలో మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా విజయం సాధించింది. మంచి ఫాంలో ఉన్న సఫారీ కెప్టెన్ డికాక్ మరో అర్ధ సెంచరీతో జట్టును ఒంటిచెత్తో గెలిపించి సిరీస్‌ను 1-1తో సమం చేశాడు. దీనిపై మాజీలతో పాటు అభిమానుల్లోనూ అసహనం వ్యక్తమైంది. కోహ్లీ అతి నమ్మకమే జట్టు ఓటమికి కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉంటే వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ట్రోల్ చేస్తూనే ఉన్నా రు. పంత్‌కి సెలక్టర్లు ఇంకెన్ని మ్యాచుల్లో అవకాశం కల్పిస్తారో చూడాలంటూ సెటైర్లు వేస్తున్నారు. అలాగే గత కొంతకాలంగా పంత్ ఆటతీరు దారుణంగా ఉందని పేర్కొంటున్నారు. హెడ్ కోచ్ రవిశాస్ర్తి, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ హెచ్చరించినా తన ఆట తీరులో మార్పు రావడం లేదని, పంత్‌కు ప్రత్యామ్నాయ మే లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వరుసగా విఫలమవుతు న్నా జట్టు చోటు దక్కడంపై సెలక్షన్ కమిటీపైనా వ్యంగ్యస్త్రాలు సంధిస్తు న్నారు. అయతే మాజీ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం పంత్‌ను వెనుకేసుకొచ్చారు. ధోనీ స్థానంలో ఆడుతున్న పంత్‌పై చాలా ఒత్తిడి ఉంటుందని, దానిని అధిగమించడంలో ఈ యువ వికెట్ కీపర్ విఫలమవుతున్నా డన్నారు. అలాగే చివరి టీ20లో నాలుగో స్థానం కోసం పంత్, అయ్యర్ ఇద్దరూ ఫీల్డ్‌లోకి రావడం జట్టులో లోపాల్ని బహిర్గతం చేసినట్లయందని పలువురు మాజీలు పేర్కొంటు న్నారు. అయతే కోహ్లీ తన తప్పిదాన్ని మీడియా ముందు అంగీకరించడం విశేషం.
కోహ్లీ ఖాతాలో
డీమెరిట్ పాయింట్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మ్యాచ్ రిఫరీ హెచ్చరించారు. ఐసీసీ నిబంధనావళిని ఉల్లంఘించినందు కు ఒక డీమెరిట్ పాయింట్‌ను విధించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ప్రత్యర్థి బౌలర్ బ్యూరన్ హెండ్రిక్స్ భుజాన్ని కోహ్లీ కావాలనే తాకాడు. ఫీల్డ్ అంపైర్లు నితిన్ మేనన్, సీకే నందన్, థర్డ్ అంపైర్ అనిల్ చౌదరి, ఫోర్త్ అంపైర్ చెట్టిహోది శంషుద్దీన్ అతడిపై అభియోగాలు నమోదు చేశాడు. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ వేసిన శిక్షను కోహ్లీ అంగీకరించాడు. ఇక అధికారిక విచారణ అవసరం లే దని ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో కోహ్లీ ఖా తాలో మూడు డీమెరిట్ పాయింట్లు చేరినట్లయింది. గతం లోనూ దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్‌లతో జరిగిన మ్యాచుల్లో నూ డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి.