క్రీడాభూమి

దక్షిణాఫ్రికా అలవోక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కెప్టెన్ క్వింటన్ డికాక్ వేగంగా 52 బంతుల్లో అజేయంగా 79 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా మూడో ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లో భారత్‌పై తొమ్మిది వికెట్ల ఆధిక్యంతో అలవోకగా విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. బ్యాటింగ్‌కు అనుకూలమయిన ఇక్కడి ఎం. చిన్నస్వామి స్టేడియం పిచ్‌పై ఆదివారం తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు పేలవమయిన ఆటతీరుతో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టులో అత్యధికంగా 36 పరుగులు చేయగా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా చెరో 19 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచారు. దక్షిణాఫ్రికా జట్టులో కగిసో రబడా 39 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, ఎడమ చేతి వాటం సీమర్ బెయురాన్ హెండ్రిక్ 14 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరు బాగా రాణించడంతో మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు మొగ్గింది. 135 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా ఎలాంటి తడబాట్లు లేకుండా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు డికాక్, రీజా హెండ్రిక్ (28) తొలి వికెట్‌కు 76 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా జట్టు కేవలం 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
దక్షిణాఫ్రికా బౌలర్లు క్రమశిక్షణాయుతంగా బంతితో చేసిన దాడితో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లు మొత్తం తొమ్మిది వికెట్లలో ఎనిమిది వికెట్లను కేవలం 71 పరుగులిచ్చి పడగొట్టడం విశేషం. తొలి ఆరు పవర్‌ప్లేలలో ఆధిక్యత కనబరిచిన భారత జట్టు 54 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ పెవిలియన్‌కు చేరుకోవడంతో దక్షిణాఫ్రికా బౌలర్ల ఆధిపత్యం ప్రారంభమయింది. 25 బంతులు ఎదుర్కొన్న ధావన్ 36 పరుగులు చేసిన తరువాత పెవిలియన్‌కు చేరాడు. తొలి ఆరు ఓవర్లలో 54 పరుగులు చేసిన టీమిండియా తరువాత ఆ ధాటిని కొనసాగించ లేకపోయింది. కగిసో రబడా పరుగులెక్కువ ఇచ్చినా మూడు వికెట్లు తీశాడు. జోర్న్ ఫోర్టుయిన్ మూడు ఓవర్లలో 19 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా, బెయురాన్ హెండ్రిక్ 14 పరుగులకే రెండు వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి ధావన్ మినహా ఏ ఒక్క భారత బ్యాట్స్‌మన్ 20 పరుగుల మార్క్‌ను చేరుకోలేక పోయారు.
*చిత్రం...బెంగళూరులో ఆదివారం భారత్‌తో జరిగిన మూడవ
టీ-20 ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వికెట్‌ను తీసిన ఆనందంలో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడ