క్రీడాభూమి

రిషబ్ పంత్ పట్ల తీరు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 22: జాతీయ క్రికెట్ జట్టు మేనేజ్‌మెంట్ యువ క్రికెటర్ రిషబ్ పంత్ పట్ల అనుసరిస్తున్న తీరును టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ గౌతం గంభీర్ తప్పుబట్టారు. కొన్నిసార్లు పేలవమయిన ఆటతీరును ప్రదర్శించిన రిషబ్ పంత్‌ను ఇటీవలి కాలంలో జట్టు మేనేజ్‌మెంట్ చాలా నిశితంగా పరిశీలిస్తోంది. టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రవి శాస్ర్తీ, బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోర్ ఇటీవల రిషబ్ పంత్ ఆట పట్ల అలక్ష్యం ప్రదర్శిస్తున్నాడని పేర్కొన్నారు. ‘వికెట్‌కీపర్- బ్యాట్స్‌మన్ పాత్ర పోషించడానికి రిషబ్ పంత్‌కన్నా సంజు సామ్‌సన్‌కే నేను వ్యక్తిగతంగా ప్రాధాన్యత ఇస్తాను. కాని, టీమ్ మేనేజ్‌మెంట్ రిషబ్ పంత్ ఆటతీరుపై ఉపయోగిస్తున్న ‘్భయం లేని నుంచి అలక్ష్యం వరకు’ వంటి పదాలు నిరుత్సాహం కలిగిస్తున్నాయి’ అని గంభీర్ ఒక ఆంగ్ల దినపత్రికకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నారు. ‘ఒక యువ మానవ వనరు పట్ల వ్యవహరించవలసిన తీరు ఇది కాదు. ప్రతి ఒక్కరూ అతను ‘వివేకశీలమయిన’ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారు. కాని, దాని అర్థమేమిటో నాకు ఇప్పటికీ తెలియదు. ఆ అబ్బాయి ఇప్పుడు పరుగులు చేయడం కన్నా మనుగడ కోసం ఆడుతున్నాడు. బయటి నుంచి చూస్తే అది అతని ఆలోచనావిధానం వలె కనపడుతుంది. ఎవరో ఒకరు అతని భుజం చుట్టూ చెయ్యి వేసి అతను టీమ్‌కు కావాలి అని చెప్పవలసిన అవసరం ఉంది’ అని పేర్కొంటూ గంభీర్.. పంత్‌కు బాసటగా నిలిచారు.