క్రీడాభూమి

పొట్టి సిరీస్‌పై కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ప్రపంచకప్ తర్వాత కోహ్లీ సేన జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్ పర్యటన లో మూడు ఫార్మాట్లలో అదరగొట్టి, సిరీస్‌లు కైవసం చేసుకున్న టీమిం డియా స్వదేశంలోనూ అదే బాటలో పయణిస్తోంది. ఈసారి దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌పై కనే్నసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ధర్మశాల వేదికగా జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా, మొహాలీలో జరిగిన రెండో మ్యాచ్‌ను 7 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఆదివారం జరిగే చివరి టీ20 లో విజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
ఓటమి ఫోబియా..
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే పొట్టి ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఇరు జట్లు ఈ సిరీస్‌ను ప్రతిష్టా త్మకంగా భావించి బరిలోకి దిగాయ. అయతే ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజీ నుంచే టోర్నీ నుంచి నిష్క్రమించిన దక్షిణాఫ్రికా ఆ తర్వాత భారీ మార్పులతో భారత పర్యటనకు వచ్చిం ది. అయతే మొహాలీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో కెప్టెన్ డికాక్‌తో పాటు టెంబ బవుమా మినహా మరెవరూ రాణించకపోవడంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. గత మ్యాచ్‌లో అగ్రశ్రేణి బౌలర్లున్నా లక్ష్యాన్ని కాపాడులేకపోయంది. దీంతో సఫారీ జట్టుకు ఓటమి ఫోబియా పట్టుకున్నట్లయంది.
రోహిత్ రాణించేనా?
ప్రపంచకప్ అద్భుతంగా రాణించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. కేవ లం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే సాధించాడు. దక్షి ణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లోనూ కేవలం 12 పరు గులు మాత్రమే చేశాడు. అయతే టీ20 ప్రపంచకప్ దృష్ట్యా రోహిత్ తిరిగి తన ఫాంను కొనసాగిస్తే జట్టుకు ఒంటి చెత్తో విజయాన్ని అందిచగలడని అభిమానులు కోరుకుంటున్నారు. అయతే చినస్వామి స్టేడియంలో రోహిత్ మంచి రికార్డే ఉండడం విశేషం. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫాంను కొనసాగిస్తున్నాడు. గత మ్యాచ్ లో అర్ధ సెంచరీ సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా టీ20ల్లో అత్యధిక అర్ధ సెంచరీలు, అత్యధిక పరుగులు చేసిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మిడిలార్డర్‌లో శ్రేయా స్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాతో పాటు లోయర్ ఆర్డర్‌లో రవీంద్ర జడేజాతో జట్టు బ్యాటింగ్ విభాగం లో బలంగానే కనిపిస్తోంది.
పంత్‌పైనే అందరి కళ్లు..
రేపు జరగబోయే చివరి టీ20 మ్యాచ్లో అందరి చూపు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పైనే ఉన్నాయ. వరుసగా విఫలమవుతున్నా పంత్ మాత్రం కనీసం ఇచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో విఫలమవుతున్నాడు. ఆరంభంలో టెస్టుల్లో సెంచరీతో రాణించి అందరి చూపు తన వైపు తిప్పుకున్నా పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం నిరా శ పరుస్తూనే ఉన్నాడు. అతడి ఫాంపై మాజీలతో పాటు అభి మానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగం లో సీనియర్లు జస్ప్రీత్ బుమ్రా, భువ నేశ్వర్ కుమార్ లేని లోటు ను కుర్రాళ్లు వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్ భర్తీ చేస్తున్నా రు. వీరికి తోడు జడేజా ఉండనే ఉన్నాడు. ఏదేమై నా పొట్టి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైని.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (కెప్టెన్), రస్సె వండర్ డుస్సెన్ (వైస్ కెప్టెన్), టెంబ బవుమా, జూనియర్ దాల, జోర్న్ ఫార్టిన్, బ్యూరన్ హెండ్రిక్స్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జ్, అండిలె ఫ్లెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబద, తబ్రెయజ్ షంసి, జాన్-జాన్ స్ముట్స్.