క్రీడాభూమి

భారత్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ: దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కోహ్లీ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ కోహ్లీ అర్ధ సెంచరీతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో ఓపెనర్లు రీజా హెండ్రిక్స్, కెప్టెన్ క్వింటన్ డీకాక్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. డికాక్ ఆది నుంచే ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ దశలో దీపక్ చాహర్ హెండ్రిక్స్ (6)ను అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా 31 పరుగుల వద్ద తన తొలి వికెట్‌ను కోల్పోయంది. ఈక్రమంలో క్రీజులోకి వచ్చిన టెంబ బవుమాతో కలిసి డికాక్ (52) మరింత చెలరేగిపోయాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ సాధించి, ఆ వెంటనే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రస్సె వన్‌డర్ డుస్సేన్ (1)ను రవీంద్ర జడేజా రిటర్నింగ్ క్యాచ్ ద్వారా అవుట్ చేశాడు. అప్పటికీ దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయ 90 పరుగులు చేసింది. ఈ దశలో బవుమాతో జత కట్టిన డేవిడ్ మిల్లర్ స్కోరు బోర్డును పెంచే బాధ్యత తీసుకున్నాడు. అయతే చాహర్ వేసిన అద్భుత బంతికి బవుమా (49) రవీంద్ర జడేజా చేతికి చిక్కాడు. మరోవైపు ధాటిగా ఆడే క్రమంలో మిల్లర్ (18) పెవిలియన్‌కు చేరాడు. డ్వేయన్ ప్రిటోరియస్ (10, నాటౌట్), అండిలె ఫెహ్లుక్వాయో (8) చివర్లో చెరో సిక్సర్ బాదడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయ 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 2 వికెట్లు తీయగా, నవ్‌దీప్ సైని, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా తలో వికెట్‌ను పడగొట్టారు.
ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (12) రెండు భారీ సిక్సర్లను సంధించి ఫెహ్లుక్వాయో బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి శిఖర్ ధావన్ (40) ధాటిగా ఆడాడు. అయతే కొద్దిసేపటికే షంసి బౌలింగ్‌లో మిల్లర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్ (4) మరోసారి నిరాశ పరిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ కోహ్లీ (72, నాటౌట్) దక్షిణాఫ్రికా బౌలర్లను పరుగులు పెట్టించాడు. శ్రేయాస్ అయ్యర్ (16, నాటౌట్)తో కలిసి మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించాడు.
విరాట్ ఖాతాలో మరో రికార్డు..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్లో కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా టీ20ల్లో అత్యధిక పరుగులు 2441 సాధించిన క్రికెటర్‌గా సరికొత్త ఘనత సాధించాడు. విరాట్ తర్వాత రోహిత్ శర్మ (2434), మార్టిన్ గుప్టిల్ (2283), షోయాబ్ మాలిక్ (2263), బ్రెండన్ మెక్‌కల్లామ్ (2140) ఉన్నారు.
స్కోర్ బోర్డు..
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రీజా హెండ్రిక్స్ (సీ) వాషింగ్టన్ సుందర్ (బీ) చాహర్ 6, క్వింటన్ డికాక్ (సీ) కోహ్లీ (బీ) నవ్‌దీప్ సైని 52, టెంబ బవుమా (సీ) రవీంద్ర జడేజా (బీ) చాహర్ 49, రస్సె వన్‌డర్ డుస్సేన్ (సీ,బీ) రవీంద్ర జడేజా 1, డేవిడ్ మిల్లర్ (బీ) హార్దిక్ పాండ్యా 18, డ్వెయన్ ప్రిటోరియస్ (నాటౌట్) 10, అండిలె ఫెహ్లుక్వాయో (నాటౌట్) 8.
ఎక్స్‌ట్రాలు: 5 మొత్తం: 149 (20 ఓవర్లలో 5 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-31, 2-88, 3-90, 4-126, 5-129
బౌలింగ్: వాషింగ్టన్ సుందర్ 3-0-19-0, దీపక్ చాహర్ 4-0-22-2, నవ్‌దీప్ సైని 4-0-34-1, రవీంద్ర జడేజా 4-0-31-1, హార్దిక్ పాండ్యా 4-0-31-1, కృనాల్ పాండ్యా 1-0-7-0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (ఎల్‌బీడబ్ల్యూ) (బీ) ఫెహ్లుక్వాయో 12, శిఖర్ ధావన్ (సీ) మిల్లర్ (బీ) షంసి 40, విరాట్ కోహ్లీ (నాటౌట్) 72, రిషభ్ పంత్ (సీ) షంసి (బీ) ఫార్టిన్ 4, శ్రేయాస్ అయ్యార్ (నాటౌట్) 16.
ఎక్స్‌ట్రాలు: 7 మొత్తం: 151 (19 ఓవర్లలో 3 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-33, 2-94, 3-104
బౌలింగ్: కగిసో రబద 3-0-24-0, అన్రిచ్ నోర్జె 3-0-27-0, అండిలె ఫెహ్లుక్వాయో 3-0-20-1, డ్వెయన్ ప్రిటోరియస్ 3-0-27-0, తబ్రెయజ్ షంసి 3-0-19-1, బోర్న్ ఫార్టిన్ 4-0-32-1.
*చిత్రాలు..విరాట్ కోహ్లీ (72, నాటౌట్)
*క్వింటన్ డికాక్ (52)