క్రీడాభూమి

ఇక సఫారీలతో ఫైట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల: కరేబియన్ పర్యటనను విజయవంతంగా ముగించిన కోహ్లీ సేన నేటి నుంచి స్వదేశంలో సఫారీలను ఢీకొనబోతుంది. ప్రపంచకప్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన దక్షిణాఫ్రికా జట్టుకు ఇదే మొదటి సిరీస్ కావడంతో ఆ జట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాదు ఈ సిరీస్‌కు ముందే జట్టు కొత్త కోచ్‌లను నియమించుకుంది. అయతే జట్టులో రెగ్యులర్ ఓపెనర్లు ఫఫ్ డుప్లెసిస్ లేకపోవడం, హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో కొత్త కుర్రాళ్ల సఫారీ జట్టు బరిలోకి దిగనుంది. అయతే సీనియర్లు కెప్టెన్ డికాక్‌తో పాటు డేవిడ్ మిల్లర్, కగిసో రబదలు కీలకంగా మారారు. ప్రపంచకప్‌లో ఘోర పరాభవం తర్వాత క్రికెట్ సౌతాఫ్రికా కొత్త జట్టుపై భారీ అంచనాలే పెట్టుకుంది. ఇందులో భాగంగానే బ్యాటింగ్ కోచ్‌గా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్‌ను నియమించుకుంది.
ప్రణాళికలో భాగంగా భారత్..
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ భారత్ జట్టులో కుర్రాళ్లకి అవకాశం కల్పించింది. ఈ ప్రణాళికలో భాగంగానే వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, నవ్‌దీస్ సైని, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్‌కు చోటు కల్పించింది, రెగ్యూలర్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలకు విశ్రాంతి కల్పించింది. వెస్టిండీస్ పర్యటనలో టెస్టుల్లో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్‌కి టీ20లో అవకాశం లభించింది. కాగా, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు విండీస్ పర్యటనలో ఒకే ఒక్క అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో పంత్‌కు టీ20లో అవకాశమిచ్చి సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు టెస్టు జట్టులో చోటిచ్చే అవకాశముంది. ఇక జట్టు పరంగా సీనియర్లు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్ ఉండగా, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాతో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. విండీస్ పర్యటనలో రాణించిన నవ్‌దీప్ సైనితో పాటు మిగతా బౌలర్లు వికెట్లు తీస్తే టీమిండియా గెలుపును ప్రత్యర్థి జట్టు అడ్డుకోవడం కష్టతరమే.
భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవ్‌దీప్ సైని.
దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డికాక్ (కెప్టెన్), రస్సే వన్ డర్ డుస్సెన్ (వైస్ కెప్టెన్), టెంబ బవుమా, జూనియర్ దలా, బోర్న్ ఫార్టిన్, బ్యురన్ హెండ్రిక్స్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జె, అండిలె ఫెహ్లుక్వాయో, డ్వేన్ పిట్రోరియస్, కగిసో రబద, తబ్రెయజ్ షంసి, జర్జ్ లిండె.
చిత్రాలు.. నెట్ ప్రాస్టీస్ సెషన్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్‌తో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ లాన్స్ క్లూసెనర్
*వర్షం కారణంగా శనివారం పిచ్‌పై కవర్లు కప్పి ఉంచిన మైదాన సిబ్బంది