క్రీడాభూమి

తిరుగులేని స్మిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్, టెస్టు బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో స్మిత్ ప్రతిభ ఆస్ట్రేలియాకు 185 పరుగుల తేడాతో విజయాన్ని అందించింది. అంతేగాక, యాషెస్ సిరీస్‌ను ఆసీస్ నిలబెట్టుకోగలిగింది. ఆ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 211 పరుగులు సాధించిన స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేశాడు. దీనితో అతను మొత్తం 937 పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (903) కంటే 32 పాయింట్లు ముందంజలో ఉభ్నిడు. భారత టెస్టు స్పెషలిస్టు చటేశ్వర్ పుజారా 878 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. కాగా, టెస్టు బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియాకే చెందిన పాట్ కమిన్స్ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. అతను 914 పాయింట్లు సంపాదించగా, రెండో స్థానంలోని కాగిసో రబదా (దక్షిణాఫ్రికా) 851, జస్‌ప్రీత్ బుమ్రా (్భరత్) 835 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్స్ విభాగంలో జాసన్ హోల్డర్ (వెస్టిండీస్/ 472 పాయింట్లు), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్/ 397 పాయింట్లు), రవీంద్ర జడేజా ( భారత్/ 389 పాయింట్లు) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. టెస్టుల్లో భారత్ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. టెస్టుతోపాటు వనే్డ, టీ-20 ఫార్మాట్స్‌లోనూ ఐసీసీ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. వనే్డ ఫార్మాట్ బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. రోహిత్ శర్మకు రెండో స్థానం దక్కడం విశేషం.

చిత్రం... స్టీవ్ స్మిత్