క్రీడాభూమి

ఇంగ్లాండ్‌కు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్‌లోని ‘ది ఓవల్’ మైదానంలో మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన ఆస్ట్రేలియా క్రికెటర్లు. ఇంగ్లాండ్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ చివరిదైన ఐదో టెస్టులో మరోసారి సత్తా చూపేందుకు ఆసీస్ సిద్ధమవుతున్నది. సిరీస్‌పై ఆస్ట్రేలియా ఇప్పటికే 2-1 ఆధిక్యాన్ని సంపాదించగా, సిరీస్‌ను డ్రా చేసేందుకు ఇంగ్లాండ్ పోరాడనుంది. ఈ సిరీస్‌లో మొదటి టెస్టును ఆస్ట్రేలియా 251 పరుగుల భారీ స్కోరుతో సొంతం చేసుకోగా, రెండో టెస్టును వర్షం వెంటాడడంతో డ్రాగా ముగిసింది. మూడో టెస్టులో ఎదురుదాడికి దిగిన ఇంగ్లాండ్ అతి కష్టం మీద వికెట్ తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను సమం చేసింది. కానీ, నాలుగో టెస్టును ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో కైవసం చేసుకొని ఆధిక్యాన్ని సంపాదించింది. సిరీస్‌ను డ్రా చేసుకోవాలంటే ఇంగ్లాండ్‌కు తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. ఆసీస్ ఈ మ్యాచ్‌ని గెలిచినా, డ్రా చేసుకున్నా సిరీస్‌ను నిలబెట్టుకుంటుంది.