క్రీడాభూమి

డ్రా దిశగా లంక, కివీస్ టెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 25: శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ డ్రా దిశగా సాగుతున్న ది. వర్షం కారణంగా మొదటి రెండు రోజుల ఆటకు తీవ్ర అంతరాయాలు ఏర్పడిన ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లం క 244 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా, మూ డో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 4 వికెట్ల కు 196 పరుగులు చేసింది. టామ్ లాథమ్ 111, బీజే వా ల్టింగ్ 25 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఓవర్‌నైట్ స్కో రుతో నాలుగో రోజు ఆటను కొనసాగించిన కివీస్ ఆట ము గిసే సమయానికి 5 వికెట్లకు 382 పరుగులు చేసింది. లాథ మ్ 154 పరుగులు చేసి ఔట్‌కాగా, ఫిఫ్త్ డౌన్‌లో బ్యాటింగ్ కు దిగిన కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌తో కలిసి వాల్టింగ్ స్కోరు బోర్డును ముందుకు దూకించాడు. వీరిద్దరూ అర్ధ శతకాల ను పూర్తి చేసి, క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో రోజు ఆట ముగి సే సమయానికి కివీస్ 5 వికెట్లకు 382 పరుగులు చేసింది. వాల్టింగ్ 81, డి గ్రాండ్‌హోమ్ 83 పరుగులతో క్రీజ్‌లో ఉ న్నారు. మరొక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉండడంతో, ఈ టెస్టు డ్రాగా ముగియడం ఖాయంగా కనిపిస్తున్నది.