క్రీడాభూమి

సింధు ‘హ్యాట్రిక్’ ఫైనల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసెల్: భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు బాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్ విభాగంలో వరుసగా మూడోసారి ఫైనల్ చేరింది. సెమీ ఫైనల్లో ఆమె ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్ చెన్ యూ ఫెయ్ (చైనా)ని ఓడించి ‘హ్యాట్రిక్ ఫైనల్’ను ఖాయం చేసుకుంది. అయితే, పురుషుల సింగిల్స్‌లో మరో తెలుగు తేజం సాయి ప్రణీత్ ఫైనల్ చేరలేకపోయాడు. సెమీ ఫైనల్లోనే అతని పోరాటానికి తెరపడింది. కాగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న సింధు మూడో ర్యాంకర్ చెన్‌పై 40 నిమిషాల్లోనే, 21-7, 21-14 తేడాతో విజయభేరి మోగించి ఫైనల్‌కి అడుగుపెట్టింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని అందుకున్న సింధు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 2013, 2014 సంవత్సరాల్లో కాంస్య పతకాలను సాధించింది. 2017లో తొలిసారి ఫైనల్ చేరింది. అయితే, కరోలినా మారిన్ చేతిలో 19-21, 10-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 2018లో మరోసారి ఫైనల్ చేరినప్పటికీ, స్వర్ణాన్ని కైవసం చేసుకోలేకపోయింది. నవోమీ ఒకుహరాకు చివరి వరకూ గట్టిపోటీనిచ్చిన ఆమె 19-21, 22-20, 21-22 తేడాతో ఓటమిపాలైంది. స్వర్ణాన్ని అందుకోలేకపోయినప్పటికీ ఆమె చేసిన పోరాటం అభిమానులను ఆకట్టుకుంది. ఇలావుంటే, ఈసారి ఫైనల్లో టైటిల్ కోసం జపాన్‌కు చెందిన నొజోమీ ఒకుహరాను సింధు ఢీ కొంటుంది. రెండో సెమీ ఫైనల్లో ఒకుహరా 2013లో ఈ టైటిల్ సాధించిన రచానొక్ ఇంతనాన్ (్థయిలాండ్)ను 17-21, 21-18, 21-15 తేడాతో ఓడించి ఫైనల్ చేరింది.
పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కెన్టో మొమొతాను ఢీకొన్న ప్రణీత్ 13-21, 8-21 తేడాతో ఓడాడు. మొదటి సెట్‌లో కొంత సేపు మొమొతాను ప్రతిఘటించినప్పటికీ, అతని అనుభవం ముందు ప్రణీత్ పోరాటం నిలవలేదు. రెండో సెట్‌లో మొమొతా దాడులకు ప్రణీత్ నుంచి సరైన సమాధానం లేకపోయింది. అయితే, అతను ఈ మెగా టోర్నీలో సెమీస్ వరకూ చేరడం ద్వారా భవిష్యత్తులో అంతర్జాతీయ పతకాలను సాధించే సత్తా తనకు ఉందని నిరూపించాడు.
చిత్రం... పీవీ సింధు