క్రీడాభూమి

ఇశాంత్ మెరుపుదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్, ఆగస్టు 24: భారత పేసర్ ఇశాంత్ మెరుపుదాడి చేయడంతో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ అల్లాడిపోయింది. రెండో రోజు ఆటను ఆరు వికెట్లకు 203 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో కొనసాగించిన టీమిండియా 297 పరుగులకు ఆలౌటైంది. లోకేష్ రాహుల్ 44, అజింక్య రహానే 81, హనుమ విహారీ 32, రిషభ్ పంత్ 24, రవీంద్ర జడేజా 58 చొప్పున పరుగులు చేసి, భారత్‌కు గౌరవ ప్రదమైన స్కోరును అందించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 36 పరుగుల వద్ద జాన్ క్యాంపెల్ వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన అతనిని మహమ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ క్రెగ్ బ్రాత్‌వెయిట్ (14)ను రిటర్న్ క్యాచ్ పట్టి పెవిలియన్‌కు పంపిన ఇశాంత్ ఆతర్వాత అదే దాడిని కొనసాగించాడు. ఫస్ట్‌డౌన్ ఆటగాడు షమ్రా బ్రూక్స్ (11)ను అజింక్య రహానే క్యాచ్ అందుకోగా రవీంద్ర జడేజా ఔట్ చేస్తే, డారెన్ బ్రేవో 18 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎల్‌బీ అయ్యాడు. అనంతరం ఇశాంత్ విండీస్ బ్యాట్స్‌మెన్‌పై విరుచుకుపడ్డాడు. అతని బౌలింగ్‌లో లోకేష్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి రాస్టన్ ఛేజ్ (48), రిషభ్ పంత్ క్యాచ్ పట్టగా షాయ్ హోప్ (24) ఔటయ్యారు. షిమ్రన్ హేత్‌మేయర్ (35)ను అతను రిటర్న్ క్యాచ్ పట్టి వెనక్కు పంపాడు. ఇశాంత్ బౌలింగ్‌లోనే విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకోగా కెమెర్ రోచ్ డకౌటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 59 ఓవర్లలో 8 వికెట్లకు 189 పరుగులు చేసింది. అప్పటికి కెప్టెన్ జాసన్ హోల్డర్ (10), మిగుల్ కమిన్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మ్యాచ్ మూడో రోజు ఈ ఓవర్ నైట్ స్కో రుతో ఆటను కొనసాగించిన విండీస్ 74.2 ఓవర్లలో 222 పరుగు లకు ఆలౌటైంది. మిగుల్ కమిన్స్ రక్షణాత్మక విధానాన్ని అనుస రించి భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడితే, జాసన్ హోల్డర్ ప రుగుల వేటలో విఫలమై, 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రి షభ్ పంత్ క్యాచ్ పట్టగా, మహమ్మద్ షమీ బౌలింగ్‌లో ఔట య్యాడు. 45 బంతులు ఆడి, ఒక్క పరుగు కూడా చేయలేకపో యన మిగుల్ కమిన్స్‌ను రవీంద్ర జడేజా బౌల్డ్ చేవాడు. విండీస్ ఆలౌటయ్యే సమయానికి షానన్ గాబ్రియల్ రెండు పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఇశాంత్ శర్మ 43 పరుగులకు ఐదు వికెట్లు పడ గొట్టగా, మహమ్మద్ షమీ 48 పరుగులకు రెండు, రవీంద్ర జడేజా 64 పరుగులకు రెండు చొప్పున వికెట్లు సాధించారు. జస్‌ప్రీత్ బు మ్రా 55 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. కాగా, అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడో రోజు భోజన విరామ సమయానికి వికెట్ నష్టం లేకుండా 14 పరుగులు చేసింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 96.4 ఓవర్లలో ఆలౌట్ 297 (లోకేష్ రాహుల్ 44, అజింక్య రహానే 81, హనుమ విహారీ 32, రిషభ్ పంత్ 24, రవీంద్ర జడేజా 58, కెమెర్ రోచ్ 4/66, షానన్ గాబ్రియల్ 3/71).
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 74.2 ఓవర్లలో 222 ఆలౌట్ (జాన్ క్యాంప్‌బెల్ 23, రాస్టన్ ఛేజ్ 48, షాయ్ హోప్ 24, షిమ్రన్ హేత్‌మేయర్ 35, జాసన్ హోల్డర్ 39, ఇశాంత్ శర్మ 5/43, మహమ్మద్ షమీ 2/48, రవీంద్ర జడేజా 2/64).
చిత్రం... విండీస్ ఆటగాడు కెమెర్ రోచ్‌ను ఔట్ చేసిన భారత పేసర్ ఇశాంత్ శర్మ ఆనందం