క్రీడాభూమి

హోరాహోరీ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 24: శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌లో హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. లంక తరఫున ధనంజయ డిసిల్వ, న్యూజిలాండ్ ఓపెనర్ లాథమ్ సెంచరీలు సాధించి ప్రేక్షకులను అలరించారు. మొదటి టెస్టును శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో గెల్చుకొని, రెండు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన నేపథ్యంలో కివీస్ విజయంపై దృష్టి పెట్టింది. అయితే, మొదటి రెండు రోజుల ఆటకు వర్షం కారణంగా అంతరాయం కలగడంతో, ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆరు వికెట్లకు 144 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో శ్రీలంక మూడో రోజు ఉదయం ఆటను కొనసాగించింది. అప్పటికి 32 పరుగులు చేసిన డిసిల్వ తర్వాత కూడా తన పోరాటాన్ని కొనసాగించాడు. అయితే, 171 పరుగుల వద్ద దిల్‌రువాన్ పెరెరా వికెట్‌ను లంక కోల్పోయింది. 13 పరుగులు చేసిన అతనిని అజాజ్ పటేల్ ఎల్‌బీగా ఔట్ చేశాడు. సురంగ లక్మల్ 10 పరుగులు చేసి, బీజే వాల్టింగ్ క్యాచ్ పట్టగా, టిమ్ సౌథీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. లసిత్ ఎంబుల్డేనియా పరుగుల ఖాతా తెరవకుండానే సౌథీ బౌలింగ్‌లో ఎల్‌బీ అయ్యాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని లంకను సెంచరీతో ఆదుకున్న డిసిల్వ 148 బంతుల్లో 109 పరుగులు చేసి, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్‌బీ కావడంతో శ్రీలంక ఇన్నింగ్స్‌కు 90.2 ఓవర్లలో 244 పరుగుల వద్ద తెరపడింది. అప్పటికి లాహిరు కుమార (5) నాటౌట్‌గా ఉన్నాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 63 పరుగులకు 3 వికెట్లు కూల్చగా, ట్రెంట్ బౌల్ట్ 75 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. కొలిన్ డి గ్రాండ్‌హోమ్, విలియమ్ సామెర్విల్లె, అజాజ్ పటేల్ తలా ఒక్కో వికెట్ తీశారు.
రెండు రోజుల ఆటకు వర్షం వల్ల తీవ్ర అంతరాయం ఏర్పడడంతో, కీలకమైన ఈ మ్యాచ్‌ని గెల్చుకోవాలంటే వేగంగా పరుగులు రాబట్టాలన్న లక్ష్యంతో కివీస్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే, జట్టు స్కోరు కేవలం ఒక పరుగు వద్ద జీత్ రావెల్ (0)ను ధనంజయ డిసిల్వ క్యాచ్ అందుకోగా దిల్‌రువాన్ పెరెరా ఔట్ చేశాడు. 34 పరుగుల వద్ద కివీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ టేన్ విలియమ్‌సన్ 28 బంతుల్లో 20 పరుగులు చేసి, లాహిరు కుమార బౌలింగ్‌లో కుశాల్ మేండిస్‌కు దొరికిపోయాడు. ఓపెనర్ లాథమ్ క్రీజ్‌లో సెటిల్‌కాగా, అతనికి చక్కటి సహకారాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించిన మాజీ కెప్టెన్ రాస్ టేలర్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. లసిత్ ఎంబుల్డేనియా బౌలింగ్‌లో అతను ధనంజయ డిసిల్వకు చిక్కాడు. హెన్రీ నికోల్స్ 46 బంతులు ఎదుర్కొని, 15 పరుగులు చేసి, దిల్‌రువాన్ పెరెరా బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. 126 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కివీస్‌కు లాథమ్‌తోపాటు బీజే వాల్టింగ్ అండగా నిలిచాడు. వీరిద్దరూ మరో వికెట్ కూలకుండా జాగ్రత్తగా ఆడడంతో, మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 62 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేయగలిగింది. లాథమ్ 184 బంతుల్లో 111 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. అతని స్కోరులో పది ఫోర్లు ఉన్నాయి. వాల్టింగ్ 62 బంతులు ఎదుర్కొని, 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో దిల్‌రువాన్ పెరెరా 76 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. లాహిరు కమార, లసిత్ ఎంబుల్డేనియా చెరొక వికెట్ సాధించారు.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 90.2 ఓవర్లలో 244 ఆలౌట్ (దిముత్ కరుణరత్నే 65, కుశాల్ మేండిస్ 32, ధనంజయ డిసిల్వ 109, ట్రెంట్ బౌల్ట్ 3/75, టిమ్ సౌథీ 4/63).
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్: 62 ఓవర్లలో నాలుగు వికెట్లకు 196 (టామ్ లాథమ్ 111 నాటౌట్, కేన్ విలియమ్‌సన్ 20, రాస్ టేలర్ 23, బీజే వాల్టింగ్ 25 నాటౌట్, దిల్‌రువాన్ పెరెరా 2/76).

చిత్రాలు.. .టామ్ లాథమ్ (111 నాటౌట్)
*ధనంజయ డిసిల్వ (109)