క్రీడాభూమి

ఇంగ్లాండ్‌కు ఓటమి భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్, ఆగస్టు 24: ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓటమి భయాన్ని ఎదుర్కొంటున్నది. అయతే, జో డెన్లీ, కెప్టె న్ జో రూట్ రెండో ఇన్నింగ్స్‌లో జట్టుకు అండగా నిలిచేందుకు ప్రయత్నించారు. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకే కట్టడి చేసినప్పటికీ, బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగా ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 67 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 171 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించి, 75.2 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేసి ఆసీస్‌ను ఆదుకున్న మార్నస్ లబుషేన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 187 బంతులు ఎదుర్కొన్న అతను 80 పరుగులు చేసి, దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. మాథ్యూ వేడ్ 33 పరుగులు సాధించాడు. వీరి కృషి ఫలితంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 75.2 ఓవర్లలో 246 పరుగులు చేయగలిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో 112 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన కారణంగా ఇంగ్లాండ్ ముందు 359 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచగలిగింది.
తమ ముందు ఉన్న భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 15 పరుగుల స్కోరువద్ద రెండు వికెట్లు కోల్పోయింది. రోరి బర్న్స్ 7 పరుగులు చేసి, డేవిడ్ వార్నర్ క్యాచ్ అందుకోగా, జొష్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. జాసన్ రాయ్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద పాట్ కమిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యా డు. అయతే, జో డెన్లీ, జో రూట్ అర్ధ శత కాలతో రాణించారు. 50 పరుగులు చేసి న డెన్నీని టిమ్ పైన్ క్యాచ్ అందుకోగా, మూడో వికెట్‌కు 126 పరుగుల భాగస్వా మ్యానికి హాజెల్‌వుడ్ తెరదించాడు. 67 ఓ వర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వి కెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. వి జయానికి ఇంకా 209 పరుగులు అవస రంకాగా, ఏడు వికెట్లు ఉన్నాయ.