క్రీడాభూమి

పాలనాదక్షుడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) శనివారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జైట్లీని పాలనాదక్షుడిగానూ, క్రికెట్ ప్రేమికుడిగానూ అభివర్ణిస్తూ ఘనంగా నివాళులర్పించింది. అందరూ గౌరవిచే నాయకుడిగా జైట్లీ సమర్థుడైన వ్యూహకర్త అని పేర్కొంది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించిన విషయాన్ని గుర్తుచేసింది. జైట్లీ సారథ్యంలో డీడీసీఏ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపింది. జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. దేశ రాజకీయాల్లో ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని వ్యాఖ్యానించింది.
జైట్లీ మృతితో తనకు శరీరంలో ఒక భాగాన్ని కోల్పోయినట్టు ఉందని మాజీ క్రికెటర్, పార్లమెంటు సభ్యుడు గౌతం గంభీర్ అన్నాడు. జైట్లీ తనకు మార్గదర్శకుడని తెలిపాడు. తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. డీడీసీఏకు అధ్యక్షుడిగా ఉన్న కాలం నుంచి జైట్లీతో తనకు ఎంతో సన్నిహిత సంబంధం ఉందని, ఆయన మృతి తనకేగాక, యావత్ భారత దేశానికీ తీరని లోటని అన్నాడు. వీరేందర్ సెవాగ్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, ఇశాంత్ శర్మ తదితరులు జైట్లీ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
అరుణ్ జైట్లీతో గౌతం గంభీర్ (ఫైల్ ఫొటో)