క్రీడాభూమి

శాంపిల్స్ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ (ఎన్‌డీఎల్‌టీ)పై ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆరు నెలల సస్పెన్షన్ విధించిన నేపథ్యంలో, అప్పటి వరకూ క్రికెటర్ల నుంచి సేకరించిన నమూనాలను ఎక్కడ భద్రపరుస్తారని జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా)కు రాసిన లేఖలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ జోహ్రీ ప్రశ్నించారు. అంతర్జాతీయ ప్రమాణాలను పాటించని కారణంగా ఎన్‌డీఎల్‌టీని ఆరు నెలలు నిషేధిస్తున్నట్టు వాడా చేసిన ప్రకటన భారత క్రీడా రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. వివిధ దేశవాళీ పోటీల సందర్భంగా క్రికెటర్ల నుంచి సేకరించిన మూత్రం నమూనాలను సస్పెన్షన్ కాలంలో ఎక్కడ భద్ర పరుస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరాడు.
అప్పీల్ చేస్తాం: కేంద్ర మంత్రి రిజిజు
ఎన్‌డీఎల్‌టీని ఆరు నెలలు పాటు వాడా సస్పెండ్ చేయ డాన్ని సవాలు చేస్తూ, అప్పీల్‌కు వెళతామని కేంద్ర క్రీడా శా ఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయని ఒక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. తాను క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీక రించిన రోజు నుంచి పలు సమస్యల పరిష్కారానికి అవి శ్రాంతంగా కృషి చేస్తున్నానని తెలిపారు. ఎన్‌డీఎల్‌టీలో నాణ్యతా ప్రమాణాలను పెంచుతున్నామని, ఈలోగా వాడా కఠిన నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఈ నిర్ణ యాన్ని క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు దృష్టికి తీసుకెళతామని అన్నారు. ఎన్‌డీఎల్‌టీలో అంతర్జాతీయ ప్రమాణాలతో పరీ క్షలు జరుగుతాయని హామీ ఇచ్చారు.