క్రీడాభూమి

ప్రణీత్, సింధు సంచల విజయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసెల్, ఆగస్టు 23: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో తెలుగు తేజాలు సాయ ప్రణీత్, పీవీ సింధు సంచలన విజయాలను నమోదు చేశారు. ఇద్దరూ ర్యాంకింగ్స్‌లో తమ కంటే మెరుగైన ప్రత్య ర్థులను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 16వ సీడ్ ప్రణీత్‌కు నాలు గో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ ఎదురయ్యాడు. దీనితో ప్రణీత్ ముందంజ వేయడం కష్టమని అంతా అను కున్నారు. అయతే, అనుమానాలకు తెరదించుతూ అతను మ్యాచ్‌ని 24-22, 21-14 తేడాతో ముగించి, సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. ఫైనల్‌లో చోటు సంపాదించడానికి అతను ప్రపంచ నంబర్ వన్ కెన్టో మొ మొతోను ఢీ కొంటాడు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మొమొతో 21-12, 21-8 ఆధిక్యంతో లీ జీ జి యాను ఓడించాడు. ఇక మహిళల సింగిల్స్‌లో ఆరోసీడ్ సింధు రెండో ర్యాంక్ క్రీడాకారిణి తాయ్ జూ ఇంగ్‌పై విజయం సాధించి సెమీ ఫైనల్ చేరింది. తొలి సెట్‌ను 12-21 తేడాతో కోల్పోయనప్పటికీ, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా పోరాటాన్ని కొనసాగించిన సింధు మిగతా రెండు రౌండ్లను 23-21, 21-19 తేడాతో గెల్చుకుంది. ఈ మెగా టోర్నీలో రెండు పర్యాయాలు కాంస్య పతకాలను, మరో రెండుసార్లు రజత పతకాలను కైవసం చేసుకున్న సింధు ఇప్పుడు స్వర్ణంపై కనే్నసింది. ఆ దిశగా బలంగా అడుగులు వేస్తూ, విజేతగా నిలిచే సత్తా తనకు ఉందని నిరూపించుకుంటున్నది.