క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఎదురుదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్, ఆగస్టు 23: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకు కుప్పకూలిన ఆస్ట్రేలియా ఎదురుదాడికి దిగింది. ఇంగ్లాండ్‌ను పూర్తి ఆత్మరక్షణలోకి నెట్టేసింది. జో డెన్లీ (12) తప్ప మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే ఔటయ్యాడు. దీనితో ఇంగ్లాండ్ 67 పరుగులకే ఆలౌటైంది. అంతకు ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ పేలవంగా కొనసాగింది. జొఫ్రా ఆర్చర్ ఏకంగా ఆరు వికెట్లు కూల్చడంతో, ఆసీస్ ఇన్నింగ్స్‌కు 52.1 ఓవర్లలో 179 పరుగుల వద్ద తెరపడింది. డేవిడ్ వార్నర్ 61, మార్నస్ లబుషేన్ 74 పరుగులు చేసి జట్టును ఆదుకోవడానికి విశేషంగా కృషి చేవారు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ ఇంగ్లాండ్ బౌలింగ్‌ను, ప్రత్యేకించి యువ పేసర్ ఆర్చర్‌ను ఎదుర్కోలేకపోయారు. వార్నర్, లబుషేన్‌తోపాటు కెప్టెన్ పైన్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కు పరిమితం కావడం ఆసీస్ బ్యాటింగ్ వైఫల్యానికి అద్దం పడుతుంది. ఆర్చర్ 17.1 ఓవర్లు బౌల్ చేసి, 45 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. స్టువర్ట్ బ్రాడ్ 32 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు. క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ చెరొక వికెట్‌ను సాధించారు.
బలమైన ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం ఇంగ్లాండ్‌కు ఎంతో సేపు నిలవలేదు. తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించి, 10 పరుగుల స్కోరవద్ద జాసన్ రాయ్ వికెట్‌ను కోల్పోయింది. అతను 15 బంతుల్లో 9 పరుగులు చేసి, జొష్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. కెప్టెన్ జో రూట్ ఒక్క పరుగు కూడా చేయకుండానే, జొష్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లోనే, వార్కర్‌కే చిక్కాడు. ఓపెనర్ రోరీ బర్న్స్ 28 బంతుల్లో తొమ్మిది పరుగులు చేసి, పాట్ కమిన్స్ బౌలింగ్‌లో టిప్ పైన్ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ఆతర్వాత కూడా కోలుకోలేదు. హార్డ్ హిట్టర్ బెన్ స్టోక్స్ 13 బంతుల్లో ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగాడు. జేమ్స్ పాటిన్సన్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కు అతను దొరికిపోయాడు. క్రీజ్‌లో పాతుకుపోయే ప్రయత్నం చేసి, 49 బంతులు ఆడిన జో డెన్లీ 12 పరుగులు చేసి, పాటిన్సన్ బౌలింగ్‌లోనే వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 45 పరుగుల వద్ద ఐదో వికెట్ కూలగా, ఒక్క పరుగు కూడా జత కలవకుండానే జానీ బెయిర్‌స్టో వెనుదిరిగాడు. 15 బంతుల్లో నాలుగు పరుగులు చేసిన అతనిని వార్నర్ క్యాచ్ పట్టగా, హాజెల్‌వుడ్ పెవిలియన్‌కు పంపాడు. రెండో రోజు ఆటలో భోజన విరామానానికి ఇంగ్లాండ్ 6 వికెట్లకు 54 పరుగులు చేయగా, జొస్ బట్లర్ 4, క్రిస్ వోక్స్ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అయితే, ఆతర్వాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. అదే స్కోరువద్ద క్రిస్ వోక్స్ తన స్కోరుకు ఒక్క పరుగు కూడా అదనంగా జోడించకుండానే, పాట్ కమిన్స్ బౌలింగ్‌లో టిమ్ పైన్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. అనేక సందర్భాల్లో ఇంగ్లాండ్‌ను ఆదుకున్న జొస్ బట్లర్ కేవలం ఐదు పరుగులు చేసి, హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖాజాకు క్యాచ్ ఇచ్చాడు. జొఫ్రా ఆర్చర్ నాలుగు పరుగులు చేసి, పాట్ కమిన్స్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కు దొరికితే, చివరిగా జాక్ లీక్ ఒక పరుగు చేసి, హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 27.5 ఓవర్లలో 67 పరుగులకే ఆలౌటైంది. 12.5 ఓవర్లు బౌల్ చేసిన జొష్ హాజెల్‌వుడ్ 30 పరుగులిచ్చి, ఐదు వికెట్లు పడగొట్టాడు. పాట్ కమిన్స్ 23 పరుగులకు మూడు వికెట్లు సాధించాడు. జేమ్స్ పాటిన్సన్ ఐదు ఓవర్లు వేసి, కేవలం తొమ్మిది పరుగులిచ్చి, రెండు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 52.1 ఓవర్లలో 179 ఆలౌట్ (డేవిడ్ వార్నర్ 61, మాముస్ లబుషేన్ 74, జొఫ్రా ఆర్చర్ 6/45, స్టువర్ట్ బ్రాడ్ 2/32, క్రిస్ వోక్స్ 1/51, బెన్ స్టోక్స్ 1/45).
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 27.5 ఓవర్లలో 67 ఆలౌట్ (జో డెన్లీ 12, జొష్ హాజెల్‌వుడ్ 5/30, పాట్ కమిన్స్ 3/23, జేమ్స్ పాటిన్సన్ 2/9).